SONU SOOD: రియ‌ల్ హీరో సోనూసూద్‌కు క‌రోనా పాజిటివ్.. సోష‌ల్ మీడియా ద్వారా వెల్లడించిన న‌టుడు

దేశంలో క‌రోనా సెకండ్ వేవ్ ప్ర‌కంప‌న‌లు పుట్టిస్తుంది.గ‌త ఏడాది సెల‌బ్రిటీలు పెద్ద‌గా క‌రోనా బారిన ప‌డ‌లేదు, కాని ఈ సారి మాత్రం టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా ప‌లు ఇండ‌స్ట్రీల‌కు చెందిన చాలా మంది ప్ర‌ముఖుల‌కు క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది. రీసెంట్‌గా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు క‌రోనా పాజిటివ్ అని తేల‌డంతో ఆయ‌న వ్య‌వ‌సాయ క్షేత్రంలోనే చికిత్స తీసుకుంటున్నారు. ఇక తాజాగా ప్ర‌ముఖ న‌టుడు సోనూసూద్ క‌రోనా బారిన ప‌డ్డారు. ఈ విష‌యాన్ని త‌న సోష‌ల్ మీడియా ద్వారా స్వ‌యంగా తెలియ‌జేశారు సోనూ.

ఈ రోజు ఉద‌యం నేను చేయించుకున్న కరోనా ప‌రీక్ష‌ల‌లో పాజిటివ్ అని నిర్ధార‌ణ అయింది. ప్ర‌స్తుతం ఐసోలేష‌న్‌లో ఉన్నాను. అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాను. ఎవ‌రు ఆందోళ‌న చెంద‌వ‌ద్దు. ఈ స‌మ‌యంలో స‌మ‌స్య‌ల‌పై పరిష్కారం చేసేందుకు మ‌రింత స‌మ‌యం దొరికింది. నేను మీ అంద‌రివాడిని అనే విష‌యం మ‌ర‌చిపోవ‌ద్దు అంటూ సోనూసూద్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. లాక్‌డౌన్ స‌మ‌యంలో చేతికి ఎముక లేద‌న్న‌ట్టు సాయాలు చేసుకుంటూ వెళ్లిన సోసూసూద్ ప్ర‌జ‌ల గుండెల‌లో దేవుడిగా కొల‌వ‌బ‌డుతున్నాడు. కొన్ని చోట్ల సోనూసూద్‌కు గుడులు కూడా క‌ట్టారు. ప్ర‌స్తుతం ఈ న‌టుడు ఆచార్య సినిమాతో బిజీగా ఉన్న విష‌యం తెలిసిందే.

Advertisement