Sonu Sood: మా ఎన్నిక‌ల‌లో సోనూసూద్ పోటీ.. పోరు హీటెక్క‌డం ఖాయం

Sonu Sood: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు మ‌రి కొద్ది రోజుల‌లో జ‌ర‌గ‌నుండ‌గా, ఈ ఎన్నిక‌లు సాధార‌ణ ఎన్నిక‌లు క‌న్నా ర‌స‌వ‌త్త‌రంగా మారుతాయా అనిపిస్తుంది. ఈ గాలి వాన చిలికి చిలికి పెను తుఫానులా మారేట్టు కనిపిస్తోంది. ఇప్ప‌టికే అధ్యక్ష పదవి రేసులో ఐదుగురు బరిలోకి దిగారు. వారు ప్ర‌కాశ్ రాజ్, మంచు విష్ణు, జీవిత‌, హేమ‌, న‌ర‌సింహారావు ఉన్నారు. వీరి మ‌ధ్య పోటీ ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్న నేప‌థ్యంలో రియ‌ల్ సోనూ సూద్ అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీ చేయ‌నున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.

sonu sood

ముందుగా అధ్య‌క్ష ప‌దవికి పోటీ చేసిన ప్ర‌కాష్ రాజ్ మెగా మద్దతుతో ముందుకు వెళ్తుండగా.. మంచు విష్ణు కోసం నరేష్ బ్యాక్ డోర్ నుంచి కథ నడిపిస్తున్నట్టు కనిపిస్తోంది. ప్ర‌కాశ్ రాజ్, మంచు విష్ణు మ‌ధ్య పోటీ ఆస‌క్తిక‌రంగా మార‌నున్న తాజా ప‌రిస్థితుల‌ని చూస్తుంటే తెలుస్తుంది. అయితే ఏకగ్రీవానికి ప్రయత్నిస్తున్నామని మురళీ మోహన్ కామెంట్ చేయ‌డం,పెద్దలందరం కూర్చుని ఈ మేరకు నిర్ణయం తీసుకుంటామ‌ని చెప్ప‌డం ఆస‌క్తికరంగా మారింది.

కరోనా కష్టకాలంలో రియల్‌ హీరోగా పేరు తెచ్చుకున్న బహుభాషా నటుడు సోనూసూద్ ఇప్పుడు మా ఎన్నిక‌ల‌లో పోటీ చేస్తున్నట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఆయ‌న‌కు ఇండ‌స్ట్రీలో చెందిన అంద‌రితో మంచి సంబంధాలు నెల‌కొని ఉండ‌గా, కొందరు ఆయ‌న‌ను పోటీ చేయ‌మ‌ని చెబుతున్న‌ట్టు తెలుస్తుంది. కాగా, కొద్ది కాలం నుండి సోనూసూద్ రాజ‌కీయాల‌తో పాటు ఏ ఎన్నిక‌ల‌లో పోటీ చేయ‌న‌ని చెప్పిన సంగ‌తి తెలిసిందే. మ‌రి సోనూసూద్ మా ఎన్నిక‌ల‌లో పోటీ చేయ‌నున్న‌ట్టు వస్తున్న వార్త‌ల‌పై ఆయ‌న ఎలా స్పందిస్తాడో చూడాలి.

సోనూసూద్ రీసెంట్‌గా తెలంగాణ ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ను ప్రగతిభవన్‌లో కలుసుకున్నారు. ఈ సమావేశంలో సోనూసూద్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను మంత్రి కేటీఆర్ అభినందించడమే కాకుండా.. దేశవ్యాప్తంగా నలుమూలల నుంచి వస్తున్న విజ్ఞప్తులకు ఎప్పటికప్పుడు స్పందిస్తూ.. ఆయన పనిచేస్తున్న తీరుని అడిగి తెలుసుకున్నారు. ప్ర‌స్తుతం సోనూసూద్ తెలుగు సినిమాల‌తో పాటు హిందీ సినిమాల‌లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే . త్వ‌రలో సోనూ న‌టించిన ఆచార్య చిత్రం విడుద‌ల కానుంది.