Sonu Sood: హైద‌రాబాద్‌లో ఇల్లు కొన్న సోనూసూద్‌.. ఇక్క‌డే ఉంటాడా ఏమి?

Sonu Sood: దేవుడు ఎలా ఉంటాడో ఎవరికీ తెలియదు.. కానీ ఆయన ఎలా ఉంటాడు అని ఎవరైనా అడిగితే అది కచ్చితంగా సోనూ సూద్ లా ఉంటాడు అంటూ చాలా మంది ఆయన పేరు చెబుతున్నారు. ఒక మనిషిని దేవుడు అంటే అది చాలా పెద్ద విషయం. ఎన్నో వేల మందికి సాయం చేస్తే తప్ప అలాంటి పేరు రాదు. ఏడాదిన్నరగా రియల్ హీరో సోనూ సూద్ ఇదే చేస్తున్నాడు.

Soonu Sood
Soonu Sood

ఇండియాకు చైనా నుంచి కరోనా వచ్చిందేమో.. కానీ ఆ సమయంలో ఒక దేవుడు కూడా ప్రజల నుంచి పుట్టాడు అంటే సోను గురించి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వార్తలు చూస్తూనే ఉంటాము.
ఎక్కడైనా కష్టం ఉంది అనే మాట వినిపిస్తే చాలు వెంటనే స్పందించడం సోనూసూద్ అలవాటు.

ఇప్పటికి దాదాపు 30 కోట్లకు పైగా సొంత డబ్బు ఖర్చు పెట్టాడు. ఈ రోజుల్లో అలాంటి మంచి మనుషులను చూడడం నిజంగానే అరుదు. ఈయన చేసిన మంచి పనులే కోట్లాది మంది అభిమానులను సంపాదించి పెట్టింది. ఇప్పుడు ఆయన క్రేజ్‌ని సినిమా వాళ్లు క్యాష్ చేసుకరోవాలని ఆరాటపడుతున్నారు. అందుకే అవకాశాలు కూడా చాలా వస్తున్నాయి. దానికి తోడు సినిమాకు 3 కోట్లకు పైగానే రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడు సోనూ సూద్.

మరీ ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో అవకాశాలు ఎక్కువగా రావడంతో హైదరాబాద్ లోనే ఉండాల్సి వస్తుంది. ఈయన ఇక్కడికి వచ్చిన ప్రతిసారి ఆయన పార్క్ హయత్ హోటల్ లో ఉంటాడు. అందుకే హైదరాబాద్ లో ఓ సొంత ఇల్లు కొనుక్కోవాలని చాలా రోజుల కింద ఫిక్స్ అయ్యాడు సోనూ సూద్. అందులో భాగంగానే బంజారా హిల్స్‌లో.. 10 కోట్లతో ఓ ఖరీదైన ఇంటికి కొనుగోలు చేసినట్టు ప్రచారం జరుగుతుంది. త్వరలోనే ఈ కొత్త ఇంట్లోకి గృహ ప్రవేశం చేయబోతున్నారు. సోనూకి ఇప్పటికే ముంబైలో ఓ ఇల్లు ఉంది. అక్కడ వరకు ఒక హోటల్ కూడా ఉంది.

మొన్న కరోనా సమయంలో దాన్ని ఉచితంగా పేదలకోసం ఉండడానికి ఇచ్చేసాడు సోను సూద్. మొత్తానికి ముంబై టు హైదరాబాద్ వచ్చినప్పుడు ఇక్కడ కూడా ఒక ఇల్లు ఉంటే బాగుంటుందనే సన్నిహితుల సూచనల మేరకు కొత్త ఇల్లు తీసుకున్నాడు సోనూ.

సోనూసూద్ తెలుగులో చాలా సినిమాలు చేశాడు. ఆయ‌న న‌టించిన ఆచార్య చిత్రం విడుద‌ల‌కి సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్, పూజా హెగ్డే ప్ర‌ధాన పాత్ర‌లు పోషించ‌గా కొర‌టాల శివ తెర‌కెక్కించాడు.