Sonu Sood: రైతుని ఎక్కించుకొని రిక్షా తొక్కిన సోనూసూద్.. ఆ తర్వాత పాలు కూడా పితికాడు
Samsthi 2210 - July 31, 2021 / 02:35 PM IST

Sonu Sood: కరోనా కష్టకాలంలో ఎంతో మందికి తన వంతు సాయమందిస్తూ రియల్ హీరోగా మారాడు సోనూసూద్. ఫస్ట్ వేవ్‌లో అడిగిన వారికి కాదనకుండా సాయం చేసిన సోనూసూద్ సెకండ్ వేవ్లో ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్స్‌తో పాటు ప్లాంట్స్ కూడా ఏర్పాటు చేశాడు. ప్రతిరోజూ వేలమంది సోషల్ మీడియా వేదికగా ఆయన్ను సాయం కోసం ఆశ్రయిస్తున్నారు. మరికొందరు వేలాది కిలోమీటర్లు ప్రయాణం చేసిన మరీ సోనూసూద్ ఇంటి వద్ద ఆయన్ని కలుసుకొని.. తమ కష్టాలను తీర్చాలని కోరుకుంటున్నారు.
సోషల్ మీడియాలోను అడిగిన వారికి కాదనకుండా సాయం చేస్తున్నారు సోనూసూద్. ఈ క్రమంలో సోనూ ఎక్కడి వెళ్లినా అక్కడ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. సోనూ తాను ఉన్నత స్థాయిలో ఉన్నా కూడా మధ్యతరగతి వ్యక్తులను చాలా ఎంకరేజ్ చేస్తుంటారు. బట్టలు కుట్టి దర్జీగా , సూపర్ మార్కెట్ లోని సరుకులు డెలివరీ చెస్ వ్యక్తిగా ఇలా రకరకాల పనలు చేసి వారిని ఉత్తేజపరిచాడు.
తాజాగా పశుగ్రాసం తీసుకుని వెళ్తున్న రైతు రిక్షాని సోనూ సూద్ తొక్కాడు. రైతుని రిక్షాలో కూర్చొపెట్టుకొని తొక్కుతూ ఆయనతో సరదగా పలు విషయాలపై చర్చించారు. అనంతరం బర్రెల పాలు కూడా పితికారు సోనూసూద్. ప్రస్తుతం ఈ వీడియో ఓ రేంజ్ లో అభిమానులను అలరిస్తుంది.కష్టానికి కేరాఫ్ అడ్రెస్‌గా మారిన సోనూసూద్ నిత్యం ఏదో ఒక విషయంతో వార్తలలో నిలుస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్యతో పాటు బాలీవుడ్ లో కూడా ఓ సినిమాలో నటిస్తున్నాడు సోనూ.
రీసెంట్‌గా సోనూసూద్ నెల్లూరులోని ఆత్మకూరులో ఆక్సీజన్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. బి. నాగలక్ష్మి అనే దివ్యాంగురాలు ఆక్సీజన్ ప్లాంట్ కోసం తనకు వస్తున్న పెన్షన్ లో నుంచి రూ. 15000వేలు సోనూసూద్ ఛారిటీ ఫౌండేషన్ కు సమర్పించింది. దీంతో ఆమెతోనే ఆక్సిజన్ ప్లాంట్ ఓపెన్ చేయించాడు.