SONU SOOD: క‌రోనాతో చ‌నిపోయిన వారి పిల్ల‌ల‌కు ఉచిత విద్య‌.. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు సోనూసూద్ అభ్య‌ర్ధ‌న‌

SONU SOOD గ‌త ఏడాది క‌రోనా వ‌ల‌న ఎంద‌రో నిరాశ్ర‌యిల‌యిన సంగ‌తి తెలిసిందే. వారిని సొంత ఖ‌ర్చుతో ఆదుకున్నాడు సోనూసూద్. అంతేకాక సాయం కోరిన వారికి లేద‌నుకుండా చేయూతనందించాడు. ఇప్ప‌టికీ సాయం చేసుకుంటూ వెళుతున్న సోనూసూద్ ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌ని చూసి చ‌లించిపోతున్నారు. ముఖ్యంగా నిర్భాగ్యులు అర్ధాంత‌రంగా ప్రాణాలు కోల్పోవ‌డం, వారి కుటుంబం క‌న్నీళ్లు పెట్టుకోవ‌డం సోనూసూద్‌ని క‌లిచి వేస్తుంది. అందుకే సోనూసూద్ క‌రోనా మ‌హమ్మారి వ‌ల‌న ప్రాణాలు విడిచిన వారి పిల్ల‌ల‌కు ఉచితంగా చ‌దువు చెప్పాల‌ని కోరాడు.

సోనూసూద్ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోని షేర్ చేస్తూ.. కోవిడ్ వ‌ల‌న ఎంతో మంది త‌మ వాళ్ల‌ను కోల్పోయి దుఃఖంలో ఉన్నారు.10 నుండి 12 సంవ‌త్స‌రాల వ‌య‌సున్న పిల్ల‌ల ప‌రిస్థితి అగ‌మ్య‌గోచ‌రంగా మారింది. ఈ నేప‌థ్యంలో కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు సానుకూలంగా స్పందించి డిగ్ర‌, ఇంజ‌నీరింగ్, మెడిక‌ల్ ఏదైన స‌రే వారికి ఫ్రీగా చ‌దువు చెప్పించాలి. ఇలా చేస్తేనే ఆ పిల్ల‌ల ఉజ్వల భవిష్య‌త్ బాగుంటుంది అని సోనూసూద్ వీడియోలో పేర్కొన్నారు. ఇటీవ‌ల ఈ రియ‌ల్ హీరో క‌రోనా బారిన ప‌డి కోలుకున్న విష‌యం తెలిసిందే.

Advertisement