SONU SOOD: మ‌ట‌న్ షాపుకి సోనూసూద్ పేరు.. నేను శాఖాహారిని అంటూ చ‌మ‌త్కరించిన రియ‌ల్ హీరో

ఒక‌ప్పుడు సోనూసూద్ పేరు కొంద‌రికి మాత్ర‌మే ప‌రిచ‌యం. ఇప్పుడ‌లా కాదు సోనూసూద్ పేరు దేశ విదేశాల‌లో కూడా వినిపిస్తుంది. ఎంతో మందికి అండ‌గా నిలిచిన సోనూసూద్ రియ‌ల్ హీరోగా మారాడు. ఆయ‌న చేసిన సేవల‌కు గాను కొన్ని ప్రాంతాల‌లో గుడులు క‌ట్టి పూజ‌లు చేస్తున్నారు. కొంద‌రు వారి పిల్ల‌ల‌కు సోనూసూద్ పేరు పెట్టుకుంటున్నారు. ఇంకొంద‌రు షాపుల‌కు సోనూ పేరు పెడుతున్నారు. తాజ‌గా తెలంగాణ‌లోని క‌రీంన‌గ‌ర్‌లో ఓ వ్య‌క్తి మ‌ట‌న్ దుకాణానికి న‌టుడు సోనూసూద్ పేరు పెట్టాడు. ఇది వార్తాంశంగా ప్ర‌చారమై సోనూసూద్ దృష్టికి వ‌చ్చింది.

దీనిపై స్పందించిన సోనూసూద్ నేను శాఖాహారిని, అలాంటిది నా పేర మ‌ట‌న్ షాపా అంటూ చ‌మ‌త్క‌రించాడు. శాఖాహార సంబంధ దుకాణానికి నేనేమైన స‌హాయం చేయ‌గ‌ల‌నా? అని సోనూసూద్‌ పేర్కొన్నాడు. కాగా, కొవిడ్ -19 మహమ్మారి సెకండ్ వేవ్‌లో సైతం సోనూసూద్ కొవిడ్ రోగులకు ఆక్సిజన్ కాన్సంట్రేట‌ర్లు అంద‌జేయ‌డం, ఇత‌ర అవ‌స‌ర‌మైన మందులు, ప‌రిక‌రాల‌ను సోనూసూద్ అందిస్తూ వ‌స్తున్నారు . జూన్‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప‌లు ఆక్సిజ‌న్ ప్లాంట్‌ల‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు సోష‌ల్ మీడియా ద్వారా ఇటీవ‌లే తెలిపాడు. అంతేకాదు క‌ర్నూలు ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో మొద‌టి ఆక్సిజ‌న్ ప్లాంట్ ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు తెలిపారు.

తాజాగా తెలుగువారికి మరో సాయం చేశాడు సోనూ సూద్. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మృతదేహాల సంరక్షణ కోసం మార్చురీ డెడ్ బాడీ ఫ్రీజర్ బాక్సులను ఇస్తున్నారు. ఇందులో సానికిరెడ్డి పల్లి ఆషాపూర్ బోంకూర్ ఓర్వకల్ మడ్డికేరా మరియు ఇంకా చాలా గ్రామాల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. అనేక గ్రామాల్లో ఫ్రీజర్ బాక్సులు అందుబాటులో లేకపోవడంతో అనేక గ్రామ సర్పంచ్లు సహాయం కోసం సోనుసూద్ ను సంప్రదించారు. దీంతో సోనూ సూద్ ఈ గ్రామాలకు సాయం చేసేందుకు ముందుకొచ్చారు.వాటిని సమకూర్చారు.