ACHARYA: ఆచార్య నుండి సాంగ్ లీక్.. త్వ‌ర‌గా రిలీజ్ చేయాలంటూ ఫ్యాన్స్ డిమాండ్

మెగాస్టార్ చిరంజీవి, గ్లామ‌ర్ క్వీన్ కాజ‌ల్ అగ‌ర్వాల్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో కొర‌టాల శివ తెర‌కెక్కిస్తున్న చిత్రం ఆచార్య‌. సామాజిక నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్‌, పూజా హెగ్డే కూడా ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. మే 13న చిత్రాన్ని విడుద‌ల చేయనున్న‌ట్టు మేక‌ర్స్ ముందుగా ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ, క‌రోనా వ‌ల‌న విడుద‌ల ఆల‌స్యం అయ్యేలా క‌నిపిస్తుంది. ఇప్ప‌టికే చిత్రానికి సంబంధించి లాహే లాహే అనే సాంగ్ విడుద‌ల చేయ‌గా, ఈ సాంగ్‌కు సూప‌ర్భ్ రెస్పాన్ప్ వ‌చ్చింది.

తాజా స‌మాచారం ప్ర‌కారం ఆచార్య నుండి బ్యూటీ ఫుల్ నెంబ‌ర్ లీక్ అయిన‌ట్టు తెలుస్తుంది. ఈ సాంగ్ రామ్ చ‌ర‌ణ్‌, పూజా హెగ్డేల‌పై ఉంటుంద‌ని నీలాంబరి అంటూ ఈ పాట సాగుతుంద‌ని స‌మాచారం. వీలైనంత త్వ‌ర‌గా ఈ సాంగ్‌ను విడుద‌ల చేయాల‌ని అభిమానులు కోరుతున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరూ నక్సలైట్లుగా నటిస్తున్నారు. దేవదాయ శాఖలో జరిగే అక్రమాల గురించి ఈ కథ నడుస్తుంది.ఇదిలా ఉంటే ఈ చిత్రంలో ధర్మస్థలి అంటూ భారీ సెట్ ఒకటి నిర్మించారు. చిరంజీవి కూడా ఈ సెట్ గురించి ప్రత్యేకంగా ప్రస్థావించారు. ఆర్ట్ డైరెక్టర్ సెల్వరాజన్ ఈ గుడి సెట్ కోసం చాలా రోజుల పాటు కష్టపడ్డారు.

Advertisement