Sonam Kapoor : సోన‌మ్ క‌పూర్ స్ట‌న్నింగ్ లుక్స్.. మ‌తులు పోగొడుతుందిగా…!

Sonam Kapoor : అనిల్ కపూర్ కుమార్తె గారాల ప‌ట్టి సోనమ్ కపూర్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. స్టార్ డాటర్‌గా సినిమాల్లోకి ప్రవేశించిన ఈ భామ.. ఆకట్టుకునే అందం, అద్భుతమైన యాక్టింగ్‌తో చాలా తక్కువ సమయంలోనే గుర్తింపుతో పాటు స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంది. తద్వారా వరుస సినిమాలతో హవా చూపించింది.

Sonam Kapoor New H0t photo shoot
Sonam Kapoor New H0t photo shoot

హీరోయిన్ అవ్వడానికి ముందే ఎన్నో విభాగాల్లో పలు రకాల శిక్షణలు తీసుకుంది. ఆరంభంలో ఎన్నో కథలను రిజెక్ట్ చేసిన ఈ భామ.. ‘సవారియా’ అనే సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. మొదటి సినిమాలోనే అద్భుతమైన నటనతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. ఇందులో గ్లామర్‌కు గ్లామర్.. యాక్టింగ్‌కు యాక్టింగ్ చూపించి మెస్మరైజ్ చేసింది.

Sonam Kapoor New H0t photo shoot
Sonam Kapoor New H0t photo shoot

‘నీర్జా’ మూవీ సోనమ్ కపూర్ కెరీర్‌లోనే ఉత్తమ చిత్రంగా నిలిచింది. అంతేకాదు, ఈ సినిమాకు గానూ ఆమె ఎన్నో రకాల అవార్డులను దక్కించుకుంది. తద్వారా దేశ వ్యాప్తంగా మంచి పేరును సంపాదించుకుంది. దీనితో పాటు ‘ప్రేమ్ రతన్ దన్ పాయో’, ‘ఖూబ్‌సూరత్’ సహా ఎన్నో చిత్రాల్లో మెస్మరైజింగ్ యాక్టింగ్ చేసింది.

కెరీర్ పరంగా ఫుల్ బిజీగా గడుపుతోన్న సమయంలోనే సోనమ్ కపూర్.. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ అహూజాను పెళ్లాడింది. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకకు సినీ లోకం అంతా వచ్చింది. ఆనంద్‌తో వివాహం తర్వాత తన పేరును సోనమ్ కపూర్ అహుజా అని మార్చుకుంది ఈ స్టార్ హీరోయిన్. గతంలో ఎంతో వేగంగా సినిమాలు చేస్తూ వచ్చిన సోనమ్ కపూర్.. వివాహం తర్వాత కూడా తన కెరీర్‌ను కొనసాగిస్తోంది.

అనిల్ కపూర్ కూతురు కావడంతో సోనమ్ కపూర్‌పై అభిమానుల నుంచి ఎన్నో రకాల ఒత్తిడులు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఆమె సినిమాల్లో కనిపించే తీరు.. సోషల్ మీడియాలో పెడుతోన్న ఫొటోలు, వీడియోలపై అభిమానులు గతంలో అభ్యంతరం వ్యక్తం చేశారు. మరీ ముఖ్యంగా సోనమ్ కపూర్ వేసుకున్న డ్రెస్‌లపై చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద పేరు ప్రఖ్యాతలు ఉన్న కుటుంబం నుంచి వచ్చి ఇలాంటి డ్రెస్‌లు ఎలా వేసుకుంటావంటూ చాలా మంది ఆమెపై విమర్శలు చేశారు.

సోన‌మ్ అలాంటివేమి ప‌ట్టించుకోకుండా త‌న అందచందాల‌తో అల‌రిస్తూనే ఉంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ అదిరిపోయే అందాల‌తో పిచ్చెక్కిస్తుంది. ఇది చూసి ఫ్యాన్స్ మైమ‌ర‌చిపోతున్నారు.