Sonali Bindre: సోనాలి బింద్రే చేదు జ్ఞాపకాలు విని ఎమోషనల్ అవుతున్న ఫ్యాన్స్

Sonali Bindre: సోనాలీ బింద్రే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్. టాప్ హీరోల సరసన నటించి ఎంతో పేరు తెచ్చుకుంది. వెండితెరపై తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది ఈ బ్యూటీ. తన గ్లామర్ తో యూత్ ని అట్రాక్ట్ చేసుకుంది. తన నటనతో ప్రేక్షకుల్ని అలరించింది. సోనాలీ బింద్రే పెళ్ళి తర్వాత సినిమాలకు సైతం దూరమై.. పర్సనల్ లైఫ్ లోకి ఎంటర్ అయ్యింది. ఆ తర్వాత చాలాకాలం ఇంటికే పరిమితమయ్యారు.

Sonali Bindre Emotional Post in instagram
Sonali Bindre Emotional Post in instagram

అలాంటిది సడెన్ గా గతేడాది ఆమె క్యాన్సర్ బారిన పడటం, ఆమె అమెరికాలో క్యాన్సర్ ట్రీట్ మెంట్ తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. చాలా కాలం ఈ వార్తలపై స్పష్టత రాలేదు. దీంతో సోనాలీ అభిమానులు, టాలీవుడ్ ప్రేక్షకులు సైతం నెట్టింట్లో ఆమె త్వరలోనే ఆరోగ్యంగా ఉండాలని, క్యాన్సర్ నుండి కోలుకోవాలని ప్రార్థించారు. ఇక ఇప్పుడు సోనాలీ తన పాత గుర్తుల్ని నెమరువేసుకున్నారు.

ముఖ్యంగా క్యాన్సర్ ను జయించినప్పుడు గుండుతో బెడ్ పై పేషెంట్ గా ఉన్నా ఫోటోను తన అభిమానులతో షేర్ చేసుకున్నారు. దీంతో పాటు టైమ్ చాలా ఫాస్ట్ గా పరుగులు పెడుతుందని, ఆ సమయంలో తాను ఎంతో వీక్ గా ఉన్నాననే విషయం గుర్తొస్తేనే చాలా ఆశ్చర్యంగా ఉందని అన్నారు. ప్రతిఒక్కరి జీవితంలో ఒక బాధాకరమైన రోజు ఉంటుంది. దాన్ని ధైర్యంతో దాటుకుని ముందుకు సాగితేనే మనకు నచ్చిన జీవితం దొరుకుతుంది. ఆ సమయం తన జీవితంలోనే ఎంతో చేదు జ్ఞాపకం అని అన్నారు. మీరు ఎలా ప్లాన్ చేసుకుంటే జీవిత ప్రయాణం అలానే సాగుతుందని ఎంతో ఎమోషనల్ గా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఇక సోనాలీ బింద్రే తెలుగులో మహేశ్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున లాంటి టాప్ స్టార్ హీరోలకు జంటగా నటించి ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు. ఆమె తెలుగమ్మాయి కాకపోయినా, టాలీవుడ్ లో ప్రేక్షకులు ఆమెను తెలుగమ్మాయిగా ఆదరించారు. సోనాలీ బింద్రే ఇప్పుడు ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు. ఎప్పటికప్పుడు ఆమె తన అభిమానులతో సోషల్ మీడియాలో టచ్ లో ఉంటున్నారు.