Sonali Bendre: క్యాన్సర్ జయించిన సోనాలి.. నాటి రోజులు గుర్తు చేసుకున్న మన్మథుడు బ్యూటీ
NQ Staff - February 22, 2022 / 03:28 PM IST

Sonali Bendre: అక్కినేని నాగార్జున కెరీర్‌లో ది బెస్ట్ మూవీలలో ఒకటి మన్మథుడు. ఈ సినిమా ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా అమెరికాలో ఏకంగా 50 రోజులు ఆడిందని చాలా మందికి తెలియదు. ఈ సినిమాలో నాగ్ ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్ చేశాడు. ఒకరు సోనాలి బింద్రే కాగా.. మరొక హీరోయిన్ అన్షు.

Sonali bendre recalls her Cancer Battle Journey
అయితే సోనాలి విషయానికి వస్తే కొద్ది రోజుల క్రితం క్యాన్సర్ బారిన పడింది సోనాలి. 2018లో తను క్యాన్సర్‌తో పోరాడుతున్న ఫొటోను రిలీజ్ చేసింది. ఈ చిత్రంలో సోనాలి చాలా జబ్బుపడినట్లు బాధపడినట్లుగా కనిపించింది. సోనాలిని చికిత్స కోసం అప్పట్లో అమెరికాకు తరలించారు. సోనాలికి మెటాస్టాటిక్ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారించారు. ఈమె న్యూయార్క్‌లో ఉండి క్యాన్సర్‌తో పోరాడి గెలిచి అక్కడి నుంచి తిరిగి వచ్చింది.
సోనాలి బింద్రే తన అనారోగ్యం గురించి చాలాసార్లు బహిరంగంగా మాట్లాడింది. క్యాన్సర్ సమయంలో ఆమె ధైర్యాన్ని కోల్పోలేదు పట్టుదలతో ముందుకు సాగింది. ఈ పోరాటంలో ఆమె భర్త గోల్డీ బెహ్ల్ ఆమెకు మద్దతు ఇచ్చాడు. అదే సమయంలో అతని కుమారుడు రణవీర్ బహ్ల్ కూడా ఆమెతో న్యూయార్క్ వెళ్ళాడు. ఇప్పుడు ప్రతిదీ సరిగ్గా ఉంది. సోనాలి ఖచ్చితంగా బాగుంది కానీ పాత రోజులను ఎప్పటికీ మరచిపోకూడదని ఆమె తెలిపింది.
ఆమె చికిత్స గురించి మాట్లాడుతూ.. తాను బతకడానికి 30 శాతం మాత్రమే అవకాశం ఉందని వైద్యులు తనతో చెప్పారని తెలిపింది. అయినా ఆమె తీవ్రంగా పోరాడింది ఈ కారణంగానే ఆమె ఈ రోజు తన కుటుంబంతో గడుపుతోంది. అయితే బోల్డ్‌గా వెండితెరపైనే కాదు రియల్ లైఫ్‌లోను ఉండాల్సి వస్తుంది.జీవితంలో ఎదురయ్యే సమస్యలు, వాటిని ధైర్య సాహసాలతో ఎలా అధిగమించాలనే ప్లాన్ తో వెళ్లాలి అని సోనాలి పేర్కొంది.