Sonali Bendre: క్యాన్సర్‌ని జయించి మళ్లీ కెమెరా ముందుకు రాబోతున్న అలనాటి అందాల హీరోయిన్
NQ Staff - March 14, 2022 / 10:41 AM IST

Sonali Bendre: విధి వైపరిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో ఊహించడం చాలా కష్టం. ఒకానొక సమయంలో స్టార్ హీరయిన్ రేంజ్‌లో ఉన్న సోనాలి బింద్రే మెటాస్టాటిక్ క్యాన్సర్ బారినపడింది. ఇక కనుమరుగైపోయినట్లే అనుకున్నారు. దాదాపు మృత్యువు ముంగిట వరకూ వెళ్లిన యాక్టరస్ సోనాలి బింద్రే ప్రాణాంతక వ్యాధిని జయించి మళ్లీ కెమెరా ముందుకు వచ్చేసింది.

Sonali Bendre as Judge for DID Li’l Masters Season 5
అదే గ్లామర్, అంతే ఉత్సాహంతో ఓ టీవీ షోకి జడ్జిగా వ్యవహరిస్తుంది. క్యాన్సర్ కారణంగా సుమారు నాలుగేళ్లుగా ప్రేక్షకులకు, అభిమానులకు దూరంగా ఉన్న సోనాలి బింద్రే డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ లిటిల్ మాస్టర్స్ సీజన్ 5 షోకి జడ్జిగా వ్యవహరిస్తోంది. మార్చి 11 నుంచి ఈ టీవీ షో టెలికాస్ట్ అవుతుంది.
బిగ్ స్క్రీన్ మీద కూడా సోనాలిని చూడాలని అభిమానులు ఎంతగానో ఆశపడుతున్నారు. ఈ క్రమంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్- కొరటాల కాంబోలో వస్తున్న చిత్రంలో సోనాలి ఒక కీలక పాత్రలో నటించనున్నదని టాక్ వినిపిస్తుంది. క్యాన్సర్ ని జయించిన సోనాలి ప్రస్తుతం తన కుటుంబంతో హ్యాపీగా జీవితాన్ని కొనసాగిస్తుంది. సినిమాల్లోకి మళ్లీ రావాలన్న కోరిక తనకు లేకపోయినా పాత్ర కోసం మేకర్స్ సోనాలిని ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారట.
ఇదే కనుక నిజమైతే ఈ సినిమా సోనాలికే కాదు ప్రేక్షకులకు స్పెషల్ అనే చెప్పాలి. మరి 19 ఏళ్ళ తరువాత అమ్మడి రీ ఎంట్రీ ఎలా ఉండబోతుందో చూడాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.ఎన్‌టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇంకా తాను నటించిన ‘ఆర్ఆర్ఆర్’ ప్రేక్షకుల ముందుకు రాకపోయినా.. ఇప్పటికే జరిగిన ప్రమోషనల్ కార్యక్రమాల్లో ప్రతీ భాషా ప్రేక్షకుడికి దగ్గరయ్యాడు ఎన్‌టీఆర్.
అందుకే కొరటాల శివ తన అప్‌కమింగ్ సినిమాను జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాకు మరింత హైప్ తీసుకుని రావడం కోసం ఇప్పటికే ఇందులో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్‌ను ఎంపిక చేశారు. ఇప్పుడు సోనాలి కూడా ముఖ్యపాత్ర పోషిస్తూ మూవీకి ఫుల్ హైప్ రావడం ఖాయం.