F3 Movie: అఫీషియ‌ల్‌: ఎఫ్‌3కి గ్లామ‌ర్ డోస్ అందించేందుకు సిద్ధ‌మైన బాల‌య్య బ్యూటీ

F3 Movie: 2008 సంవత్సరంలో రెయిన్ బో అనే సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయిన అందాల ముద్దుగుమ్మ‌ సోనాల్ చౌహాన్.. ఆ తర్వాత బాలయ్య సరసన లెజెండ్ సినిమాలో నటించి ఫేమస్ అయింది. ఆ త‌ర్వాత ‘డిక్టేటర్’తో పాటు రూలర్ సినిమాలో నటించింది. ప్రస్తుతం చేతిలో అవకాశాలు లేకపోవడంతో గ్లామర్‌ షోను నమ్ముకొని అవకాశాల కోసం వల వేస్తోంది.

TheNewsQube-
Sonal Chauhan also Act in F3 Movie
Sonal Chauhan also Act in F3 Movie

లెజెండ్ సినిమా సూపర్ హిట్టైనా కూడా తెలుగులో పెద్దగా అవకాశాలైతే రాలేదు ఈ ముద్దుగుమ్మకు. అయితే వీలున్నప్పుడల్లా విదేశీ బీచ్‌లలో బికినీలతో ఫోటోలకు ఫోజ్‌లిస్తూ.. కుర్రాళ్ల మతులు పోగొడుతోంది. తాజాగా ఎఫ్ 3 చిత్రం లోకి బాలీవుడ్ భామ సోనాల్ చౌహాన్ అఫీషియల్ గా ల్యాండ్ అయినట్లు మేక‌ర్స్ తెలియ‌జేశారు.

ఎఫ్ 3 చిత్రం లో తను భాగం కావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది సోనాల్‌. ఎఫ్ 3 చిత్రం లో భాగం అయినందుకు చాలా సంతోషం గా ఉందని పేర్కొన్నారు. ఈ అవకాశం కల్పించిన దర్శకుడు అనిల్ రావిపూడి, దిల్ రాజు, శిరీష్ లకు థాంక్స్ చెబుతూ, వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రిన్ లతో నటించేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు తెలిపారు.

సోనాల్ చౌహాన్ చేసిన పోస్ట్ పై దర్శకుడు అనిల్ రావిపూడి రిప్లై ఇస్తూ, ఎఫ్ 3 కుటుంబం లోకి స్వాగతం అని అన్నారు. నువ్వు ఇందులో భాగం అయినందుకు చాలా సంతోషం గా ఉందని పేర్కొన్నారు. దిల్‌’ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక సునీల్ మాత్రం కొత్తగా ఈ ప్రాజెక్ట్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు.

వెంక‌టేశ్‌, వ‌రుణ్‌తేజ్, తమన్నా, మెహ్రీన్ హీరోహీరోయిన్లుగా శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న మోర్ ఫ‌న్ రైడ‌ర్ ‘ఎఫ్3’ షూటింగ్‌ రీస్టార్ట్‌ అయ్యింది. ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా భారీ వ‌సూళ్ల‌ను సాధించిన ‘ఎఫ్‌2’ చిత్రానికి ఫ్రాంచైజీగా ‘ఎఫ్ 3’ రూపొందుతోన్న సంగతి తెలిసిందే.