NBK108 : బాలయ్య కోసం బాలీవుడ్ భామనే పట్టుకొస్తున్నాడా.. అనీల్ ప్లానింగ్స్ మాములు లేవుగా..!
NQ Staff - July 30, 2022 / 05:33 PM IST

NBK108 : అఖండ చిత్రం తర్వాత బాలకృష్ణ జోష్ మాములుగా లేదు. ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో బాలకృష్ణ వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు.ప్రస్తుతం ఈయన గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ యాక్షన్ సినిమా చేస్తున్నాడు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. దీని తర్వాత అనిల్ రావిపూడితో సినిమా చేయనున్నాడు.
తగ్గేదే లే..
ఇప్పటికే బాలయ్య 107 చిత్రంలో గ్లామర్ బ్యూటీ శృతి హాసన్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక 108వ చిత్రంలో లీడ్ హీరోయిన్ కోసం నార్త్ బ్యూటీలను వెతుకుతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హాను సంప్రదించినట్టు సమాచారం. త్వరలోనే బాలయ్య హీరోయిన్ ని ఫైనల్ చేసే పనిలో ఉన్నారు చిత్ర యూనిట్.

Sonakshi Sinha Going Fix in NBK108
ఇప్పటికే బాలీవుడ్ హీరోయిన్స్ కత్రినా కైఫ్, విద్యా బాలన్ తో బాలయ్య కలిసి పనిచేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బాలయ్య ‘ఎన్బీకే107’ చిత్ర షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. మూవీ నుంచి వచ్చిన పోస్టర్స్, గ్లింప్స్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇండస్ట్రీలో సక్సెస్ తో దూసుకుపోతున్న బాలయ్య- గోపీచంద్ కాంబినేషనల్ లో వస్తున్న ఈ పవర్ ఫుల్ చిత్రం కోసం అభిమానులు తెగ ఎదురుచూస్తున్నారు.
ఒకవైపు సినిమాలు.. మరోవైపు రాజకీయాలు.. అది కాకుండా.. బాలకృష్ణ ఎవరు ఊహించని విధంగా మెగా ఫ్యామిలీకి చెందిన ‘ఆహా’ ఓటీటీకి హోస్ట్‌గా చేయడానికి ఓకే చెప్పడం ఎవరు ఊహించి ఉండరు. అంతేకాదు హోస్ట్‌గా బాలయ్య ఈ షోను సక్సెస్ చేసిన విధానం కూడా అందరినీ ఆకట్టుకుంది. ఇక అన్‌స్టాపబుల్ సీజన్ 2 పై ఆగష్టు 15న అప్డేట్ ఇవ్వనున్నారు.