PRASHANT NEEL : సాలిడ్ అప్‌డేట్ ఇవ్వ‌బోతున్న ప్ర‌శాంత్ నీల్‌.. క‌ళ్ల‌ల్లో ఒత్తులు వేసుకొని మ‌రీ ఎదురు చూస్తున్న ఫ్యాన్స్

PRASHANT NEEL : ఒక‌ప్పుడు ప్ర‌శాంత్ నీల్ అంటే క‌న్న‌డ ప్రేక్ష‌కుల‌కు మాత్ర‌మే ఈ పేరు సుప‌రిచితం. ఇప్పుడు ఈయ‌న దేశ వ్యాప్తంగా ఫుల్ పాపులారటీ సంపాదించుకున్నారు. రాజ‌మౌళి త‌ర్వాత మ‌ళ్లీ ఆ రేంజ్ క్రేజ్ సంపాదించుకున్న ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ అని చెప్ప‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు. క‌న్న‌డ హీరో య‌ష్ ప్ర‌ధాన పాత్ర‌లో ప్ర‌శాంత్ నీల్ కేజీఎఫ్ అనే చిత్రాన్ని తెర‌కెక్కించి రికార్డుల ప్ర‌భంజ‌నం సృష్టించాడు. దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన ఈ చిత్రంకు సీక్వెల్‌గా కేజీఎఫ్ 2 అనే చిత్రాన్ని కూడా చేశాడు ప్రశాంత్ నీల్‌. ప్ర‌స్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది.

కేజీఎఫ్ 2 చిత్రం పూర్తైందో లేదో వెంట‌నే పాన్ ఇండియ‌న్ స్టార్ ప్ర‌భాస్‌తో క‌లిసి స‌లార్ అనే సినిమా మొద‌లు పెట్టాడు. ఈ చిత్రం భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందుతుంది. వెరైటీ కాన్సెప్ట్‌తో స‌లార్ చిత్రం రూపొందుతున్న‌ట్టు తెలుస్తుండ‌గా, ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులు బ‌ద్ద‌లు కొట్ట‌డం ఖాయంగా కనిపిస్తుంది. స‌లార్ త‌ర్వాత ప్ర‌శాంత్ నీల్ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తోను ఓ పాన్ ఇండియా సినిమా చేయ‌నున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఈ మ‌ధ్యే అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చింది. ప్ర‌స్తుతం ఎన్టీఆర్.. త్రివిక్ర‌మ్, ఆర్ఆర్ఆర్ చిత్రాల‌తో బిజీగా ఉండ‌గా,వీటి త‌ర్వాత ప్ర‌శాంత్ నీల్‌- ఎన్టీఆర్ సినిమా సెట్స్ పైకి వెళ్ల‌నుంది.

ప్ర‌శాంత్ నీల్ ఖాతాలో మ‌రో పాన్ ఇండియా ప్రాజెక్ట్ కూడా వ‌చ్చి చేరిందని కొన్నాళ్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. త‌మిళ స్టార్ హీరో విజ‌య్ ని ప్ర‌శాంత్ నీల్ డైరెక్ట్ చేయ‌బోతున్నాడంటూ జోరుగా ప్ర‌చారం న‌డుస్తుంది. ఇప్పుడు ఇంది మ‌రింత బ‌ల‌ప‌డింది. ఈ సెన్సేషనల్ కాంబోలో సినిమా ఫిక్సయ్యినట్టుగా బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.విజ‌య్ ఎలాంటి పాన్ ఇండియా సినిమా చేయ‌క‌పోయిన ఆయ‌న‌కు 250 కోట్ల‌కు పైగా మార్కెట్ ఉంది. విజ‌య్‌తో ప్ర‌శాంత్ నీల్ సినిమా చేస్తున్నాడ‌నే స‌రికి అంద‌రి దృష్టి ఈ ప్రాజెక్ట్‌పై ప‌డింది. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న ఎప్పుడు వ‌స్తుందో చూడాలి.

Advertisement