syed sohel: ప్రస్తుతం బిగ్ బాస్ ఉత్సవాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. స్టార్ మా వాళ్లు బిగ్ బాస్ కంటెస్టెంట్లందరినీ ఒకే చోటకు తీసుకొచ్చి ఓషోను ప్లాన్ చేస్తున్నట్టుంది.అయితే అది షోనా? లేక ఏదైనా స్పెషల్ ఈవెంటా? అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. అయితే బిగ్ బాస్ ఉత్సవం అనే పేరుతో ఓ కార్యక్రమం అయితే రాబోతోంది. ఇందులో బిగ్ బాస్ నాలుగు సీజన్ల కంటెస్టెంట్లందరూ పాల్గొంటున్నారు. ఇందులో కొందరు కనిపించడం లేదు. అయితే వారు ఇతర కారణాల వల్ల గానీ షూటింగ్‌లతో బిజీగా ఉండటం వల్ల గానీ హాజరు కాలేదని తెలుస్తోంది.
బిగ్ బాస్ తెలుగు మూడు సీజన్ల కంటెస్టెంట్లందరూ నిన్నటి నుంచి సోషల్ మీడియాలో సందడి చేశారు. మూడు సీజన్ల కంటెస్టెంట్లందరూ ఒకే స్టేజ్ మీదకు రావడం, అందరూ కలిసి ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో అంతా షాక్ అయ్యారు. అదిరిపోబోతోందని సామ్రాట్ అంచనాలు పెంచేశాడు. ఇంకా ఎంత మందిని ట్యాగ్ చేయాలంటూ తన బిగ్ బాస్ కంటెస్టెంట్ల రీ యూనియన్ ఫోటోపై హిమజ కామెంట్ చేసింది. మూడు సీజన్ల కంటెస్టెంట్లు ఒకే ఫ్రేమ్‌లో ఉండటంతో ట్యాగ్ చేయడం హిమజకు కష్టమైంది.
అయితే అప్పటి వరకు కేవలం మూడు సీజన్ల కంటెస్టెంట్లతోనే ఈవెంట్‌ను ప్లాన్ చేశారని అనుకున్నారు. కానీ హిమజ అసలు విషయం లీక్ చేసింది. నాల్గో సీజన్ మెంబర్స్ కూడా త్వరలోనే జాయిన్ కాబోతోన్నారని అసలు మ్యాటర్ చెప్పేసింది. ఆమె చెప్పినట్టుగా ఇప్పుడు నాల్గో సీజన్ కంటెస్టెంట్లందరూ కూడా షూటింగ్లో పాల్గొన్నారు.
ఉత్సవంలో సోహెల్ సందడి: syed sohel

ఈ క్రమంలో సోహెల్ అక్కడ రచ్చ రచ్చ చేసినట్టు కనిపిస్తోంది. మళ్లీ గంగవ్వ వచ్చింది. హారిక, దివి, అఖిల్, మెహబూబ్, మోనాల్ ఇలా అందరితో కలిసి సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో పెట్టేశాడు సోహెల్. అయితే మొత్తానికి స్టార్ మా గట్టిగానే ప్లాన్ వేసినట్టు కనిపిస్తోంది.