Sohel : బిగ్ బాస్ ఇంట్లో సోహెల్ మెహబూబ్ చేసిన సందడి అందరికీ తెలిసిందే. మొదట్లో అందరూ ఓ జట్టుగా కలిసిపోయారు. అందరి గ్యాంగ్‌లో లేడీస్ కూడా ఉండేవారు. కానీ చివరకు మాత్రం మెహబూబ్ సోహెల్ ఇద్దరే మిగిలారు. అలా ఈ ఇద్దరి మధ్యే ఎక్కువగా స్నేహ బంధం ఏర్పడింది. అంతే కాకుండా ఈ ఇద్దరికీ జిమ్ అంటే ఇష్టం. తిండి విషయంలోనూ ఇద్దరి అభిప్రాయాలు కలిసిపోయాయి.
అలా బిగ్ బాస్ ఇంట్లో ఈ ఇద్దరూ కలిసి రచ్చ రచ్చ చేశారు. ప్రతీ సారి ఒకరికొరు తోడుగా ఉంటూ వచ్చారు. ఎలిమినేషన్ సమయంలోనూ సోహెల్ కాపాడాడు. కెప్టెన్సీ పవర్‌ను ఉపయోగించి నామినేషన్ నుంచి మెహబూబ్‌ను తప్పించాడు. ఇలా ఇద్దరూ కలిసే ఆటలు ఆడారు.. చివరకు హింట్ వీడియో అంటూ ఇద్దరిపై ఆరోపణలు కూడా వచ్చాయి. అలా హింట్ ఇవ్వడంతోనే సోహెల్ 25 లక్షలు తీసుకున్నాడనే టాక్ వచ్చింది.
అవన్నీ గతం. ఇప్పుడు అదంతా ఎవ్వరూ మాట్లాడుకోవడం లేదు. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. ప్రస్తుతం సోహెల్ అరియానా మెహబూబ్ ఇలా అందరూ కలిసి రచ్చ చేస్తున్నారు. అయితే తాజాగా మెహబూబ్ ఓ వీడియో వదిలాడు. ఇందులో తన జిమ్ సెషన్ పూర్తయిందని, గంటన్నర చేశానని, సోహెల్ మాత్రం తప్పించుకున్నాడంటూ కామెంట్ చేశాడు.
Sohel : ఎక్కడున్నా సరే దాన్ని వదిలే ప్రసక్తే లేదట..
ఎక్కడున్నా సరే జిమ్ చేస్తున్నట్టు ఆధారాలు చూపించు అంటూ సోహెల్‌కు మెహబూబ్ సవాల్ విసిరాడు. ఎక్కడున్నా సరే మనం జిమ్‌ను, వర్కవుట్లను వదిలే ప్రసక్తే లేదని కష్టపడుతున్న ఫోటోను షేర్ చేశాడు. ప్రస్తుతం సోహెల్ తన సినిమా కోసం బాగానే రెడీ అవుతున్నాడు.