Waltair Veerayya : ‘వాల్తేరు వీరయ్య’పై ట్రోలింగ్.! శృతి వయసెంత.? మెగాస్టార్ చిరంజీవి వయసెంత.?
NQ Staff - December 8, 2022 / 03:45 PM IST

Waltair Veerayya : మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతోన్న ‘వాల్తేరు వీరయ్య’ సినిమా రానున్న సంక్రాంతికి విడుదల కానున్న సంగతి తెలిసిందే. జనవరి 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
శృతిహాసన్ ఈ ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్గా నటిస్తున్నా, అసలామెకు సంబంధించిన పోస్టర్స్ ఏవీ ఈ సినిమా నుంచి ఇప్పటిదాకా బయటకు రాలేదు.
మెగాస్టార్ ట్వీట్ చేసిన టూర్ ఫొటో..
కుటుంబంతో.. హీరోయిన్‌తో.. అంటూ మెగాస్టార్ చిరంజీవి విదేశీ టూర్ గురించి ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. కుటుంబ సభ్యులతో చిరంజీవి.. హీరోయిన్‌తో వాల్తేరు వీరయ్య.. అన్నమాట.
యూరోప్‌లో చిరంజీవి, శృతిహాసన్ మీద ‘వాల్తేరు వీరయ్య’ సినిమా కోసం పాటల్ని చిత్రీకరించబోతున్నారు. ఈ క్రమంలో చిరంజీవి తన కుటుంబ సభ్యుల్ని వెంటేసుకుని యూరోప్ పయనమయ్యారు. అదే విమానంలో శృతిహాసన్ కూడా యూరోప్ వెళ్ళినట్లు తెలుస్తోంది.
‘శృతి.. నువ్వు ఈ సినిమాలో వున్నావని ఇప్పుడే కన్ఫామ్ అయ్యింది..’ అంటూ సెటైర్లేస్తున్న నెటిజనం.. ‘చిరంజీవి వయసేంటి.? శృతిహాసన్ వయసేంటి.?’ అంటూ ట్రోల్ చేస్తుండడం గమనార్హం.