Dil Raju : ప్రమోషన్ కు రాని హీరోకు పార్టీ ఇవ్వడం అవసరమా రాజు గారు?
NQ Staff - January 23, 2023 / 07:54 PM IST

Dil Raju : టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇటీవల సంక్రాంతి కానుకగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వారసుడు సినిమాను తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. తమిళ్ సూపర్ స్టార్ విజయ్ హీరోగా నటించిన సినిమా ప్రమోషన్ కార్యక్రమాల కోసం తీసుకు వచ్చేందుకు ప్రయత్నం జరిగింది.
కానీ హైదరాబాద్ కి ప్రమోషన్ కోసం హాజరయ్యేందుకు విజయ్ నిరాకరించాడట. చెన్నైలో ఒక ఈవెంట్ లో పాల్గొన్న విజయ్ హైదరాబాదులో మాత్రం ఈవెంట్ నిర్వహిస్తాం అంటే నో అన్నాడని సమాచారం అందుతుంది.
విజయ్ హీరోగా గతంలో వచ్చిన సినిమాలకు కూడా తెలుగు రాష్ట్రాల్లో ప్రమోషన్ కోసం హాజరైంది లేదు. వారసుడు సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుని తమిళనాడు లో భారీ కలెక్షన్స్ నమోదు చేస్తోంది. దాంతో హైదరాబాదులో సినిమా యొక్క సక్సెస్ పార్టీ ని దిల్ రాజు ఏర్పాటు చేయడం జరిగింది.
ప్రమోషన్ కార్యక్రమాలకు హాజరు కాని హీరో విజయ్ ఇలా సక్సెస్ పార్టీకి హాజరవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయినా ప్రమోషన్ కార్యక్రమాలకు హాజరు కాని విజయ్ ని ఎలా పిలిచి పార్టీ ఇస్తారు అంటూ దిల్ రాజు పై కొందరు కామెంట్ చేస్తున్నారు.
తమిళ హీరోలను నెత్తిన పెట్టుకుంటే కాస్త అతి చేస్తారనే విషయం ఇప్పటికైనా దిల్ రాజు అర్థం చేసుకుంటే బాగుంటుందని మీడియా సర్కిల్స్ వారు గుసగుసలాడుకుంటున్నారు.