Film Starts : సెలబ్రిటీలూ మనుషులే.! ఎప్పుడంటే అప్పుడు ఛంపెయ్యకండ్రా.!
NQ Staff - November 25, 2022 / 09:19 PM IST

Film Starts : మొన్న కమల్ హాసన్.. నిన్న ఉపేంద్ర.. అసలేం జరుగుతోంది.? ఔను, ఏం జరుగుతుంది.? సెలబ్రిటీలయినంత మాత్రాన వాళ్ళు మనుషులు కాదా.? వాళ్ళకి అనారోగ్య సమస్యలు రావా.?
పొరపాటున చిన్నపాటి అనారోగ్య సమస్యతో సెలబ్రిటీలు ఆసుపత్రికి వెళితే చాలు, సోషల్ మీడియా, వెబ్ మీడియా.. దాంతోపాటుగా మెయిన్ స్ట్రీమ్ మీడియా తొందరపడి వాళ్ళని తమ రాతల్లో చంపేస్తున్న వైనాన్ని ఇటీవల తరచూ చూస్తున్నాం.
కమల్ క్షేమం.. ఉపేంద్రకి ఏమీ కాలేదు..
కమల్ హాసన్ భేషుగ్గా వున్నారు.. చిన్నపాటి అనారోగ్య సమస్యే. ఇక, ఉపేంద్ర విషయానికొస్తే.. షూటింగ్ స్పాట్లో చెలరేగిన దుమ్ము కారణంగా కొంత ఇబ్బంది పడ్డారు. ఆసుపత్రికి వెళ్ళారు.. సమస్య క్లియర్ అయిపోయింది. ఆ వెంటనే వచ్చేశారు.
‘నేను బతికే వున్నాను.. చంపెయ్యకండ్రా..’ అంటూ ప్రముఖ నటుడు ఉపేంద్ర, తన మీద వస్తున్న పుకార్లపై స్పందించాడు. కమల్ హాసన్ది కూడా ఇదే ఆవేదన. మొన్నామధ్య విక్రమ్ విషయంలో కూడా ఇలాగే జరిగింది.