రేణు దేశాయ్ రెండో పెళ్లికి సిద్ధమైందా.. ఆ న‌వ్వు వెనుక ఉన్న అర్ధం అదేనా?

Samsthi 2210 - December 22, 2020 / 09:51 AM IST

రేణు దేశాయ్ రెండో పెళ్లికి సిద్ధమైందా.. ఆ న‌వ్వు వెనుక ఉన్న అర్ధం అదేనా?

ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ కొన్నాళ్ళుగా వార్త‌ల‌లో నిలుస్తూ వ‌స్తుంది. అప్ప‌ట్లో ఓ సారి రెండో పెళ్లి చేసుకుంటాన‌ని హింట్ ఇచ్చే స‌రికి ప‌వ‌న్ ఫ్యాన్స్ ఆమెపై చిర్రుబుర్రులాడారు. చేసుకోవ‌ద్దంటూ రిక్వెస్ట్ చేశారు. దీనికి రేణూ దేశాయ్ స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చింది. ఇలా కొన్నాళ్ళు ఈ టాపిక్స్ తోనే రేణూ వార్త‌ల‌లో నిల‌వగా, త‌ర్వాత త‌ర్వాత రేణూ రెండో పెళ్లి విష‌యాన్ని అంతా మ‌ర‌చిపోయారు. అయితే ప‌వ‌న్‌తో విడపోయిన త‌ర్వాత పూణేలో ఉంటున్న రేణూ దేశాయ్ ఇప్పుడు హైద‌రాబాద్‌కు మ‌కాం మార్చిన‌ట్టు తెలుస్తుంది.

ప‌లు సినిమాలు, వెబ్ సిరీస్‌ల‌తో బిజీగా ఉండడం వ‌ల‌న హైద‌రాబాద్‌కే షిఫ్ట్ అయిన‌ట్టు తెలుస్తుంది. అయితే సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే రేణూ అప్పుడ‌ప్పుడు త‌న పోస్ట్‌ల‌తో నెటిజ‌న్స్ ని క‌న్ఫ్యూజ్ చేస్తూ ఉంటుంది. తాజాగా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేయ‌గా, ఇందులో రేణూ దేశాయ్ ప‌గ‌ల‌బ‌డి న‌వ్వుతుంది. ప‌క్క‌న ఆద్య కూడా న‌వ్వుతూ డ్యాన్స్ చేస్తుంది. మేము ఇలా న‌వ్వ‌డం వెనుక ఓ కార‌ణం ఉంది. ఆ కార‌ణం ఏంటో తెలుసుకోవాలి అంటే కొద్ది రోజులు వేచి ఉండండి అని పేర్కొంది.

రేణూ క్రియేట్ చేసిన స‌స్పెన్స్ చూస్తుంటే త‌న రెండో పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అయినందుకు న‌వ్వుతుందా, లేదంటే త‌న సినిమా ప్ర‌మోష‌న్ కోసం ఇలాంటి జిమ్మిక్స్ ప్లే చేస్తుందా అని నెటిజ‌న్స్ తెగ ఆలోచిస్తున్నారు. ఇప్ప‌టికే సింగ‌ర్ సునీత డిజిటల్ రంగానికి చెందిన రామ్ అనే వ్య‌క్తితో రెండో పెళ్లికి సిద్ధం కాగా, ఇప్పుడు రేణూ కూడా చేసుకుంటుందేమోన‌ని ఫిలిం న‌గ‌ర్ లో జోరుగా చ‌ర్చ న‌డుస్తుంది. ఇదిలా ఉంటే రేణూ దేశాయ్ రీసెంట్‌గా సునీత ప్రీ వెడ్డింగ్ సెల‌బ్రేష‌న్‌కి హాజ‌రై సంద‌డి చేసిన సంగ‌తి తెలిసిందే. ప‌లు టీవీ షోస్ లోను రేణూ అడ‌పాద‌డాపా క‌నిపిస్తూ అల‌రిస్తూ వ‌స్తుంది.

 

View this post on Instagram

 

A post shared by renu desai (@renuudesai)

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us