PAWAN KALYAN: నెగెటివ్ వ‌చ్చినా కూడా నిర్భందంలోనే.. ప‌వన్ క‌ళ్యాణ్‌కు ఏమైంది!

పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆయ‌న పేరే ఒక ప్ర‌భంజ‌నం. ఆయ‌న సినిమా థియేట‌ర్స్‌లోకి వ‌చ్చిందంటే బాక్సాఫీస్ రికార్డులు తిర‌గ‌రాయ‌డం ఖాయం. రాజ‌కీయాల వ‌ల‌న మూడేళ్ల పాటు సినిమాల‌కు దూరంగా ఉన్న ప‌వ‌న్ రీసెంట్‌గా వ‌కీల్ సాబ్ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా ఏప్రిల్ 9న విడుద‌లై బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. క‌రోనా క‌నుక లేక‌పోయింటే వ‌కీల్ సాబ్ సునామికి పాత రికార్డులన్నీ బ‌ద్దలు అయి ఉండేవి. ఒక‌వైపు రాజ‌కీయాలకు సంబంధించిన ప‌నులు చూసుకుంటూనే మ‌రోవైపు క్రిష్‌, హ‌రీష్ శంకర్, అయ్య‌ప్ప‌నుమ్ కోషియ‌మ్ రీమేక్ చిత్రాల షూటింగ్ పూర్తి చేసే ప‌నిలో ఉన్నాడు ప‌వ‌న్.

కొద్ది రోజుల క్రితం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు క‌రోనా సోక‌డంతో ఆయ‌న త‌న ఫాం హౌజ్‌లో ఐసోలేష‌న్‌కు వెళ్లాడు. అపోలో వైద్యుల‌తో పాటు మ‌రికొంత మంది ప్ర‌త్యేక వైద్య బృందం ప‌వ‌న్‌కు ప్ర‌త్యేక చికిత్స అందించ‌డంతో ఆయ‌న త్వ‌ర‌గానే కోలుకున్నారు. రీసెంట్‌గా జ‌రిపిన ప‌రీక్ష‌లో నెగెటివ్ అని నిర్దార‌ణ అయింది. సాధారణంగా కరోనా నెగిటివ్ తర్వాత బయటికి వచ్చేస్తుంటారు. కాని పవన్ మాత్రం నిర్భందంలోనే ఉన్నాడు. అత‌న‌కు ఇంకా ఎందుకు బ‌య‌ట‌కు రావ‌డం లేదు, పూర్తిగా కోలుకోలేదా అనే అనుమానాలు అభిమానుల మ‌తుల‌ని తొలుస్తున్నాయి.

ప‌వ‌న్‌కు నెగెటివ్ వ‌చ్చిన బ‌య‌ట‌కు రాక‌పోవ‌డానికి కార‌ణం బ‌లంగానే ఉంది. లోపల ఇన్ఫెక్షన్ మాత్రం అలాగే స్వల్పంగా ఉండిపోయిందని, పవన్ లంగ్స్ ఇన్ఫెక్ట్ కావడంతో లోపలే ఉండి చికిత్స తీసుకుంటున్నాడు అని వైద్యులు అంటున్నారు. అయితే ప‌వ‌న్ ఆరోగ్యంకు సంబంధించి ఎలాంటి ఆందోళ‌న చెంద‌న‌క్క‌ర్లేద‌ని, మ‌రి కొద్ద రోజుల‌లో ఆయ‌న మాములు మ‌నిషి అవుతార‌ని అంటున్నారు. ప‌వ‌న్ కు క‌రోనా వ‌చ్చిన‌ప్ప‌టి నుండి ఆయ‌న అభిమానులు, కుటుంబ స‌భ్యులు ప‌వ‌న్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్ధిస్తున్నారు.

Advertisement