Snigdha: ఇందిరా పార్క్‌లోకి ఈడ్చుకొని వెళ్లాడంటూ ఎమోష‌న‌ల్ అయిన న‌టి స్నిగ్ధ‌

Snigdha: మ‌హిళ‌ల‌కు వేధింపులు కొత్త కాదు. ఎంతో మంది సెల‌బ్స్ ప‌లు సంద‌ర్భాల‌లో తాము వేధించ‌బ‌డ్డ సంఘ‌ట‌ల‌ను గుర్త చేసుకుంటున్నారు. తాజాగా కమెడియన్ స్నిగ్ద త‌ను ఎదుర్కొన్న పరిస్థితుల గురించి చెప్పి ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది. స్నిగ్ధ‌… ఆమె పేరు చెప్పగానే వేషధారణ గుర్తుకు వస్తుంది. అబ్బాయిలా హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్‌తో కనిపిస్తుంది.

Snigdha draged into indra park3
Snigdha draged into indra park3

అలా మొదలైంది, మేం వయసుకు వచ్చాం వంటి సినిమాలతో స్నిగ్ద పాపులర్ అయింది. అయితే తాజాగా తాను సూపర్ క్వీన్ అనే షోలో పార్టిసిపేట్ చేస్తోంది. ఇందులో తన గతం గురించి చెబుతూ అందరినీ ఎమోషనల్ చేసింది.

2011 లో నందినీ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘అలా మొదలైంది’ చిత్రం ద్వారా సినిమాల్లోకి వచ్చింది. ఆమె ఈ చిత్రంలో పింకీ పాత్రలో.. నాని, నిత్యా మీనన్ లకు స్నేహితురాలిగా నటించింది. ఈ సినిమాలో అబ్బాయి లుక్ లో కనిపించి స్నిగ్ధ కామెడీని పండించింది. తర్వాత ఆమె మేం వయసుకు వచ్చాం, రొటీన్ లవ్ స్టోరీ, కిట్టు ఉన్నాడు జాగ్రత్త, దమ్ము చిత్రాలలో నటించింది.

అబ్బాయి లుక్ లో కనిపించి స్నిగ్ధ కామెడీని పండిస్తూ ఉంటుంది. ఎంతో చలాకీగా.. నవ్వుకుంటూ కనిపించే స్నిగ్ధ జీవితంలో జరిగిన ఓ చేదు అనుభవాన్ని తాజాగా జీ తెలుగులో ప్రసారం అయ్యే సూపర్ క్వీన్ ప్రోమో లో ఎమోషనల్ అవుతూ పంచుకున్నారు. తాను చిన్న తనంలో పాఠశాలకు వెళ్తున్న క్రమంలో ఓ ఘటన జరిగిందని చెప్పుకొచ్చారు.

Snigdha draged into indra park2
Snigdha draged into indra park2

తాను స్కూల్ కు వెళ్తున్న క్రమంలో తన తండ్రి ఎన్నో జాగ్రత్తలు చెబుతూ పంపించేవాడని చెప్పారు. ఎవరి వద్దకు వెళ్లకుండా.. వెళ్లిన దారిలోనే మళ్లీ తిరిగి రావాలని జగ్రత్తలు చెప్పేవారని తెలిపింది. అయితే ఓ రోజు ఇందిరా పార్క్ లో ఆడుకోవడానికి వెళ్తుంటే.. తనను ఒక వ్యక్తి పక్కకు లక్కెళ్ళాడు అని చెబుతూ కంటతడి పెట్టింది. ఈ ఘటన విన్న అక్కడ మహిళా సెలబ్రిటీలు అందరూ కంటతడి పెట్టారు. ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది