Sneha: టైం ఫ‌ర్ వ్యాక్సిన్… చుక్క‌లు చూపించిన న‌టి స్నేహా

Sneha: క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌ళ‌యం కొన‌సాగుతూనే ఉంది. ఈ వైర‌స్ ధాటికి చాలా మంది క‌న్నుమూసారు. త్వ‌ర‌లో థ‌ర్డ్ వేవ్ రానున్న దృష్ట్యా ప్ర‌జ‌లు, ప్ర‌భుత్వాలు అప్ర‌మ‌త్త‌మ‌వుతున్నాయి. ముఖ్యంగా వ్యాక్సిన్ వేయించుకునేందుకు ఆస‌క్తి చూపుతున్నారు. వ్యాక్సిన్ వ‌ల‌న క‌రోనా ప్ర‌భావం త‌క్కువ‌గా ఉండ‌డంతో సామాన్యులు, సెల‌బ్స్ వ్యాక్సిన్ కోసం ఎగ‌బ‌డుతున్నారు.

sneha
snehaవ్యాక్సిన్ వేయించుకునే స‌మ‌యంలో కొంద‌రు భామ‌లు చేస్తున్న సంద‌డి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారుతుంది. పాయ‌ల్‌, దీప్తి సున‌య‌న వ్యాక్సిన్ వేయించుకునే స‌మ‌యంలో చాలా భ‌య‌ప‌డ‌గా, వారిని చూసి నెటిజ‌న్స్ స్ట‌న్నింగ్స్ కామెంట్స్ పెట్టారు. ఇక తాజాగా సీనియ‌ర్ న‌టి స్నేహా కూడా వ్యాక్సిన్ వేయించుకుంది. అయితే ఆ స‌మ‌యంలో స్నేహా చేసిన హంగామాని త‌న కెమెరాలో బంధించి సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు ప్ర‌సన్న‌.

ముఖానికి మాస్కు పెట్టుకొని టీకా వేసుకోవటానికి సిద్ధమైన స్నేహా.. సూది దగ్గరకు వచ్చేసరికి వెనక్కి వెళ్లటం.. మళ్లీ ముందుకు రావటం.. సూది చేతికి దగ్గరకు రాగానే.. ఇంజెక్షన్ కు ఆమె భయపడిన వైనాన్ని ఆమెకు దగ్గరగా ఉన్న భర్త ప్రసన్న స్వయంగా వీడియో తీశారు. సోష‌ల్ మీడియాలో ఈ వీడియోని షేర్ చేయడంతో అభిమానులు దీనిని చూసి తెగ న‌వ్వుకుంటున్నారు. వ్యాక్సిన్ అంటే అంత భ‌య‌మా అనే కామెంట్స్ పెడుతున్నారు.

ఒక‌ప్పుడు టాప్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న స్నేహా దాదాపు అప్ప‌టి స్టార్ హీరోలంద‌రితో క‌లిసి ప‌ని చేసింది. తెలుగు, తమిళ, మలయాళ భాషలలో న‌టించిన స్నేహా తెలుగు ప్రేక్షకులకి మాత్రం గోపీచంద్ హీరోగా నటించిన తొలివలపు సినిమాతో పరిచయం అయింది. ఇక ప్రియమైన నీకు, శ్రీరామదాసు, సంక్రాంతి సినిమాలు ఆమెకి మంచి పేరును తీసుకువచ్చాయి

నటుడు ప్రసన్నతో ప్రేమ‌లో ప‌డ్డ స్నేహా ఇరు పెద్దలను ఒప్పించి వీరు 2012 వీరిద్దరి విహహ బంధంతో ఒకటయ్యారు. వీరికి ఇప్పటికే విహాన్‌ అనే బాబు,ఓ పాప ఉంది. జాతీయ బాలికల దినోత్సవం రోజున స్నేహా అమ్మాయికి జన్మనివ్వడం యాదృశ్చికమని అభిమానులు అప్ప‌ట్లో తెగ కామెంట్స్ చేశారు. పెళ్లి తర్వాత సినిమాలకి బ్రేక్ చెప్పిన స్నేహ మళ్ళీ తన రెండో ఇన్నింగ్స్ ని మొదలు పెట్టింది. ఇప్పటికే తెలుగులో రామ్ చరణ్ హీరోగా వచ్చిన వినయ విదేయ రామ సినిమాలో నటించింది. ధనుష్‌ హీరోగా తెరకెక్కిన తమిళ చిత్రం పటాస్‌లో ఆమె నటించారు.