Sneha: చీర‌క‌ట్టులో క్యూట్ స్మైల్‌తో కనిపించిన స్నేహ‌

Sneha: సహజమైన నటిగా పేరు తెచ్చుకున్న స్నేహ ఎన్నోతెలుగు చిత్రాల‌లో క‌నిపించి మెప్పించింది. 2012 స్నేహ, ప్రసన్న వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. 2015లో కొడుకు విహాన్ జన్మించాడు. గ‌త‌ ఏడాది జనవరిలో కుమార్తె ఆద్యంతకు స్నేహ జన్మనిచ్చారు. హీరోయిన్‌గా బ్రేక్‌ తీసుకున్నాక కూడా స్నేహా అడపాదడపా మెరుస్తుంది.

Sneha Looks So Beautiful in Saree
Sneha Looks So Beautiful in Saree

స్నేహ తెలుగులో `తొలి వలపు`, `హనుమాన్‌ జంక్షన్‌`, `వెంకీ`, `సంక్రాంతి`, `రాధాగోపాలం`, `శ్రీరామదాసు`, `ఏవండోయ్‌ శ్రీవారు`, `మహారధి`, `పాండురంగడు`, `అమరావతి`, `రాజన్న, హనుమాన్ జంక్షన్’, ‘మధుమాసం’, ‘నీ సుఖమే నే కోరుకున్నా’, ‘ఉలవచారు బిర్యానీ’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’.. ` చిత్రాల్లో నటించింది. పెళ్లి తర్వాత హీరోయిన్‌గా సినిమాలకు గుడ్‌బై చెప్పింది. మళ్లీ అడపాదడపా క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా ప‌ల‌క‌రిస్తుంది.

Sneha Looks So Beautiful in Saree
Sneha Looks So Beautiful in Saree

తాజాగా స్నేహా చీర‌క‌ట్టులో క్యూట్ స్మైల్ ఇస్తూ క‌నిపించింది. ఈ అమ్మ‌డిని చూసి ఆమె అభిమానులు తెగ మురిసిపోతున్నారు. స్నేహ తెలుగులో చివరిగా ‘వినయ విధేయ రామ’ సినిమాలో నటించారు. ఇందులో ప్రశాంత్‌కు భార్యగా, రామ్ చరణ్‌కు వదినగా స్నేహ నటించారు.

Sneha Looks So Beautiful in Saree
Sneha Looks So Beautiful in Saree
Sneha Looks So Beautiful in Saree
Sneha Looks So Beautiful in Saree