Sivaji Raja: అయ్యో! శివాజీ రాజా ఇలా అయిపోయాడేంటి?

Sivaji Raja: శివాజీ రాజా తెలుగు ఇండ‌స్ట్రీలో చాలా ఫేమ‌స్. దాదాపు40 ఏళ్ల ప్ర‌స్థానం అత‌నిది. వంద‌ల సినిమాల‌లో న‌టించిన ఆయ‌న నిర్మాత‌గా, హీరోగా, మా అసోసియేష‌న్ ప్రెసిడెంట్‌గాను ప‌ని చేశాడు. కొద్ది సంవ‌త్స‌రాల క్రితం క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా న‌టించి త‌నదైన వినోదం పంచిన శివాజీ రాజా రాను రాను న‌ట‌న‌కు దూరమ‌య్యాడు. మా ప్రెసిడెంట్‌గా ఉన్న‌ప్పుడు ప‌లు వివాదాల‌తో ఆయ‌న పేరు నిత్యం వార్త‌ల‌లో ఉండేది.

Sivaji Raja Became too Lean Due to Health Issues1
Sivaji Raja Became too Lean Due to Health Issues1

కొద్ది కాలం నుండి శివాజీ రాజా అస్స‌లు ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. స‌డెన్‌గా ఆయ‌న‌ తన తనయుడు వినయ్‌ రాజా హీరోగా ఎంట్రీ ఇస్తున్న ‘వేయు శుభములు కలుగు నీకు’ సినిమాలోని ఓ సాంగ్‌ విడుదల కార్యక్రమంలో క‌నిపించారు. ఒక‌ప్పుడు బొద్దుగా ఉన్న శివాజీ రాజాని ఇలా చూసే స‌రికి అభిమానులు షాక్ అయ్యారు. అదేంటి.. అక్కడ కనిపిస్తున్నది నిజంగానే శివాజీ రాజానా.. అలా అయిపోయాడేంటి అనుకుంటున్నారు.

గతేడాది ఆయన గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. అయితే ఇంతవరకు మీడియాకు దూరంగా ఉన్న ఆయన ఆస్పత్రి నుంచి కోలుకుని ఇంటికి వచ్చినప్పటికి తన ఆరోగ్యంపై ఎలాంటి అప్‌డేట్‌ ఇవ్వలేదు. అయితే గుండెపోటు వచ్చాక బరువు తగ్గిపోయారని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉన్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి.

శివాజీ రాజా కొడుకు వినయ్ రాజా హీరో అయ్యాడు. ఇప్పటికే ఈయన హీరోగా జెమ్ అనే సినిమా పూర్తి చేశాడు. ఆ సినిమా ఇంకా రిలీజ్ కాకముందే ప్రస్తుతం ఈ కుర్రాడు వేయి శుభములు కలుగు నీకు అనే టైటిల్ తో రెండో సినిమాతో వస్తున్నాడు.

అయితే ప్ర‌స్తుతం శివాజీ రాజా త‌న‌యుడి సినిమా క‌న్నా ఆయ‌న లుక్‌పైనే అంతటా హాట్ హాట్ చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. స‌డెన్‌గా ఇలా మారే స‌రికి శివాజీ రాజాకు ఎమైందంటూ ఫాలోవర్స్‌, అభిమానులు కంగారు పడుతున్నారు.కొన్ని రోజులుగా సినిమాలు, సోష‌ల్ మీడియాకు దూరంగా ఉంటూ వ‌స్తున్న శివాజీ రాజా మ‌ళ్లీ పాత రోజులు గుర్తు చేయాల‌ని అంద‌రు కోరుతున్నారు.