Siva nirvana : శివ నిర్వాణ సక్సస్ ట్రాక్ నానికి ప్లస్ అవుతుందా..?

Siva nirvana : నానికి నేచురల్ స్టార్ గా టాలీవుడ్ ప్రేక్షకుల్లో క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ‘వి’ సినిమా తర్వాత వరుసగా సినిమాలను కమిటై బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది నాని టక్ జగదీష్, శ్యాం సింగరాయ్, అంటే.. సుందరానికి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే ఇందులో టక్ జగదీష్ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు. శివ నిర్వాణ అంతకు ముందు నిన్ను కోరి, మజిలీ సినిమాలతో వరసగా సక్సస్ ని తన సొంతం చేసుకున్నాడు. ఈ రెండు సినిమాలు ఫ్యామిలీ ఒరియంటెడ్ ఫీల్ గుడ్ సినిమాలు.

siva-nirvana-is success track going to be plus for nani
siva-nirvana-is success track going to be plus for nani

అయితే ఇదే ఫ్యామిలీ సెంటిమెంట్ ని టక్ జగదీష్ లో కూడా కంటిన్యూ చేస్తున్నాడన్న మాట ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. అందుకు కారణం ఈ సినిమా పోస్టర్.. టీజర్ లో ఫ్యామిలీని ప్రత్యేకంగా చూపించడమే. అయితే నాని – శివ నిర్వాణ కాంబోలో నిన్ను కోరి సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. అందువల్లే ఈ సారి కూడా టక్ జగదీష్ అంతక మించి సక్సస్ కాబోతుందని గట్టి నమ్మకంతో ఉన్నారు. ఈ హిట్ కాంబోలో రూపొందుతున్న ఈ సినిమా పై అంచనాలు బాగా పెరిగిపోయాయి. శివ నిర్వాణ, నానిల పై నమ్మకం తో టక్ జగదీష్ పై బయ్యర్లు భారీ మొత్తాన్ని పెడుతున్నట్లు సమాచారం.

Siva nirvana : శివ నిర్వాణ గత చిత్రాల సక్సస్ ట్రాక్ తోనే టక్ జగదీష్ సినిమా పై అంచనాలు.

ఇక ఈ సినిమాలో నానికి జోడిగా రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు. గత మూడేళ్ళుగా మంచి ఫాంలో ఉన్న ఎస్.ఎస్.థమన్ సంగీతమందించాడు. సాహు గారపాటి, హరీష్ పెద్ది.. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. నానికి ఉన్న క్రేజ్ శివ నిర్వాణ సక్సస్ ట్రాక్ ని బట్టి చూస్తే ఈ సినిమా అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా అనిపిస్తుంది. ముఖ్యంగా శివ నిర్వాణ గత చిత్రాల సక్సస్ ట్రాక్ తోనే టక్ జగదీష్ సినిమా పై సగం బిజినెస్ చేసేస్తుందని చెప్పుకుంటున్నారు. మొత్తానికి భారీ వసూళ్ళని రాబట్టబోతుందని మేకర్స్ ధీమాగా ఉన్నారు. కాగా ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా దగ్గరపడుతోంది. సరిగ్గా నెలరోజులు కూడా లేకపోవడంతో తాజాగా ప్రమోషన్స్ ని మొదలు పెట్టారు.

Advertisement