Mrunal Thakur : అందాల మన సీత హల్దీ వేడుకలో మెరిసిందోచ్..!
NQ Staff - September 15, 2022 / 12:11 PM IST

Mrunal Thakur : మృనాల్ ఠాగూర్.. ప్రస్తుతం ఈ పేరు తెలుగు ప్రేక్షకులను కుదిపేస్తోంది. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సీతారామం సినిమా ఏ స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకుందాం తెలిసింది. ఆ సినిమాలో హీరోయిన్ గా బుల్లి తెర బ్యూటీ మృనాల్ ఠాకూర్ నటించిన భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది.

Sitharamam Mrunal Attend Haldi Event1
ఒక పద్ధతి అయిన చీర కట్టు లో కనిపించి ఏమాత్రం స్కిన్ షో చేయకున్నా కూడా స్టార్ హీరోయిన్ గా మాదిరిగా ఆమెను అభిమానిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఆమె నుండి టాలీవుడ్ లో వరుసగా సినిమాలు వస్తాయని ప్రేక్షకులు భావిస్తున్నారు.
ఆమెకు సంబంధించిన ప్రతి ఒక్క ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. తాజాగా ఈ అమ్మడు తన సన్నిహితుల యొక్క పెళ్లి హల్ది వేడుకలో పాల్గొంది. ఆ సందర్భంగా ఎల్లో డ్రెస్ లో ఈ అమ్మడు మెరిసింది.
కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఆ ఫోటోలను షేర్ చేయడంతో ఒక్క సారిగా మళ్ళీ వైరల్ అయింది. పెళ్లి వేడుకలు ఎంతో అందంగా కనిపిస్తున్న ఈ అమ్మడిని అభిమానులు తెగ లైక్ చేస్తున్నారు.
సీత ఇలా ఎల్లో డ్రెస్సులో హల్దీ వేడుకలో ఎంతో చక్కగా ఉంది అంటూ ప్రేక్షకులు మరియు ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ముందు ముందు ఆమె తెలుగులో వరుసగా సినిమాలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. కానీ ఈ అమ్మడు బాలీవుడ్ పై ఎక్కువ ఫోకస్ గా ఉన్నట్లుగా అనిపిస్తుంది.