Sitara: క్యూట్ డ్యాన్స్ చేస్తున్న మహేష్ కూతురు.. సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న వీడియో

Sitara: సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు గారాల ప‌ట్టి సితార సోష‌ల్ మీడియాలో ఎంత ఫేమ‌స్సో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆమె చేసే సంద‌డికి సంబంధించిన ఫొటోలు లేదా వీడియోలని న‌మ్ర‌త అప్పుడ‌ప్పుడు సామాజిక మాధ్య‌మాల‌లో షేర్ చేస్తుంటుంది. ఇవి నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటూ ఉంటాయి. సితార ఇప్పుడు చాలా పెద్ద‌దైంది. ప‌లు విష‌యాల‌పై చాలా అవ‌గాహ‌న‌తో మాట్లాడుతూ అందుకు సంబంధించిన వీడియోల‌ని త‌న ప‌ర్స‌న‌ల్ అకౌంట్‌లో షేర్ చేస్తూ ఉంది.

సితార తాజాగా త‌న ఫ్రెండ్‌తో క‌లిసి క్యూట్ డ్యాన్స్ చేసింది. ఇందులో తాను వేసిన స్టెప్స్ నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి. క్యూట్ సితార‌పై స్ట‌న్నింగ్ కామెంట్స్ పెడుతున్నారు.గ‌తంలోను సితార త‌న డ్యాన్స్‌తో నెటిజ‌న్స్‌ని ఎంత‌గా అట్రాక్ట్ చేసిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.ముఖ్యంగా త‌న తండ్రి సినిమాల‌లోని పాట‌ల‌కు డ్యాన్స్‌లు చేసి అల‌రించింది.

ఇక సూపర్‌స్టార్ మహేష్ బాబు విష‌యానికి వ‌స్తే ఆయ‌న ప‌క్కా ఫ్యామిలీ పర్స‌న్ అన్న సంగ‌తి మ‌నంద‌రికి తెలిసిందే. లాక్ డౌన్‌లో ఫుల్ టైం ఫ్యామిలీతో కేటాయించిన మ‌హేష్‌.. తన పిల్లలకు సంబంధించిన విశేషాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు. నమ్రత కూడా మహేష్ , గౌతమ్, సితారకు సంబంధించిన చిన్న చిన్న విషయాల్ని కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.

సితారకు ఎక్కువగా వంశీ పైడిపల్లి కూతురు ఆద్య, సుకుమార్ కూతురు సుకృతి అంటే చాలా ఇష్టం. ఆద్యతో కలిసి ఆ మధ్య సితారా యూట్యూబ్‌లో చేసిన వీడియోలు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరూ కలిసి ఏకంగా మహేష్ బాబునే ఇంటర్వ్యూ చేసేశారు. సితార ఎక్కువ‌గా ఆద్య‌, సుకృతితోనే ఉంటుంది.