Sitaramam : ‘సీతారామం’ సినిమాకి షాక్ ఇవ్వనున్న వైఎస్సార్సీపీ.!
NQ Staff - July 30, 2022 / 03:00 AM IST

Sitaramam : ఈ మధ్య సినిమాలకి పొలిటికల్ షాక్‌లు ఎక్కువైపోయాయి. ‘వకీల్ సాబ్’, ‘భీమ్లానాయక్’ సినిమాలకి మంత్రులే రివ్యూలు ఇచ్చిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపించింది. టీడీపీ, బీజేపీ పాజిటివ్ రివ్యూలు ఇస్తే, వైసీపీ కంప్లీట్ నెగెటివ్ రివ్యూలు ఇవ్వడమే కాకుండా, వైసీపీ ప్రభుత్వం.. ప్రత్యేకంగా ఈ రెండు సినిమాల టిక్కెట్లు, ప్రదర్శనలపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.

Sitaramam film get trobles from Andhra pradesh govt
‘శ్యామ్ సింగరాయ్’ సినిమాకీ తలనొప్పులు తగ్గలేదు. ‘ఆచార్య’ సినిమాకీ పొలిటికల్ ప్రకంపనలు గట్టిగానే తాకాయి. ‘సర్కారు వారి పాట’ సినిమాపై వైసీపీ శ్రేణులు కొంత ప్రత్యేక సానుభూతి చూపించినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది.
రామారావుకి అలా.. సీతారామంకి ఇంకోలా..
‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాపై విపరీతమైన నెగెటివిటీ క్రియేట్ అయ్యింది వైసీపీ శ్రేణుల నుంచి. ‘దెబ్బ కొట్టేశాం ఫ్రెండ్స్.. తర్వాతి దెబ్బ అశ్వనీదత్ సినిమాకి..’ అంటూ వైసీపీ మద్దతుదారులు సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యానిస్తున్నారు.
అశ్వనీదత్, తాజాగా పలు ఇంటర్వ్యూలలో వైసీపీ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో ‘సీతారామం’ సినిమాని డిజాస్టర్ చేసేద్దామని వైసీపీ మద్దతుదారులైన నెటిజన్లు పిలుపునిస్తుండడం కొసమెరుపు. నిజంగానే, ఆ రాజకీయ ప్రభావం సినిమాల ఫలితాలపై వుంటుందా.? అంటే, అది మళ్ళీ వేరే చర్చ.