Sitara Ghattamaneni Appreciated By All : గొప్ప మనసు చాటుకున్న సితార.. పుట్టినరోజు నాడు ఆ పని చేసి ప్రశంసలు..

NQ Staff - July 20, 2023 / 05:13 PM IST

Sitara Ghattamaneni Appreciated By All : గొప్ప మనసు చాటుకున్న సితార.. పుట్టినరోజు నాడు ఆ పని చేసి ప్రశంసలు..

Sitara Ghattamaneni Appreciated By All :

టాలీవుడ్ లో ఎంతో అన్యోన్యంగా ఉండే జంటల్లో మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ ఒకరు. ఈ జంట గారాలపట్టి సితార గురించి ప్రేక్షకులకు బాగా తెలుసు.. అంతేకాదు సితార ఎప్పటి నుండి సోషల్ అకౌంట్ కలిగి ఉంది. ఈమెకు కూడా భారీ ఫాలోవర్స్ ఉన్నారు. తనకు సంబంధించిన ప్రతీ విషయాలను పంచుకుంటూ ఉంటుంది..

ఎప్పుడు సితార సోషల్ మీడియాలో డ్యాన్స్ వీడియోలతో, ఫొటోలతో ఫాలోవర్స్ ను పెంచుకుంటూ పోతుంది. ఇక ఈ మధ్య ఘట్టమనేని ప్రిన్సెస్ అమెరికా లోని టైమ్స్ స్క్వేర్ పై ఎక్కి చిన్న వయసులోనే అరుదైన గౌరవాన్ని సాధించింది. జ్యువెలరీ యాడ్ చేసి చిన్న వయసులోనే పాపులర్ అయ్యింది.. పీఎంజేకు అంబాసిడర్ గా మారి ఇంటర్నేషనల్ గా పాపులర్ అయ్యింది..

అంతేకాదు తన ఫస్ట్ రెమ్యునరేషన్ ను ఛారిటీకి ఇచ్చి తన గొప్ప మనసు చాటుకుని మహేష్ తగ్గ కూతురుగా నిరూపించుకుంది.. ఇక సితార ఈ రోజు పుట్టిన రోజును జరుపు కుంటుంది.. జులై 20, 2023న ఈమె తన 11వ పుట్టిన రోజు జరుపు కుంటుంది.. అయితే ఈ పుట్టిన రోజు నాడు అందరిచేత ప్రశంసలు అందుకుంటుంది.

ఈమె చేసిన పని అందరి చేత శభాష్ అనిపించుకునేలా ఉంది.. సితార తన పుట్టినరోజు నాడు తన వంతు సహాయంగా నిరుపేద బాలికలకు అండగా నిలిచింది.. తన సొంత ఊరు బుర్రిపాలెం లోని ప్రైమరీ స్కూల్ విద్యార్థినులతో గడిపి సితార ఫౌండేషన్ నుండి బాలికలకు సైకిల్స్ ను బహుమతిగా అందించింది. ఈమె చేసిన ఈ పని మరోసారి ప్రశంసలు అందుకునేలా చేసింది.

Sitara Ghattamaneni Appreciated By All

Sitara Ghattamaneni Appreciated By All

ఇదిలా ఉంటే.. సితార తన ఫస్ట్ రెమ్యూనరేషన్ ను కూడా చారిటీకి అందించి గొప్ప మనస్సును చాటుకుంది. ఇక తను సినీ రంగంలో అడుగుపెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు రీసెంట్ గా జరిగిన పీఎంజే మీడియా కార్యక్రమంలో తెలిపింది. ఇప్పటికే మహేశ్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’లో ఓ సాంగ్ కు డాన్స్ ఇరదీసింది. తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.

 

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us