Sirish: గాయ‌ప‌డ్డ అల్లూవార‌బ్బాయి.. ఇది ఫ్యాష‌న్ కోసం కాదు అంటూ కామెంట్

Sirish: ఈ కాలం హీరోలు పాత్ర కోసం ఎంత క‌ష్టాన్నైన ఇష్టంగా స్వీక‌రిస్తున్నారు. కొన్ని సంద‌ర్భాల‌లో గాయాల పాలైన ఏ మాత్రం బెద‌ర‌కుండా క‌మింట్‌మెంట్‌తో ప‌ని పూర్తి చేస్తున్నారు. టాలీవుడ్ యువ హీరోల్లో ప్రస్తుతం సక్సెస్ కోసం అల్లు శిరీష్‌ తీవ్రంగా కష్టపడుతున్న విష‌యం తెలిసిందే.ఆయ‌న నటించిన సినిమాల‌లో శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు చిత్రం తప్ప మ‌రే సినిమా పెద్ద విజ‌యం సాధించ‌లేదు.

శిరీష్ తండ్రి బ‌డా నిర్మాత‌, అన్న అల్లు అర్జున్ స్టార్ హీరో అయిన‌ప్ప‌టికీ వారిద్దరు శిరీష్ కెరీర్‌ని ఉన్నత స్థాయిలో నిల‌బెట్ట‌లేకబోతున్నారు. ఎంతో అనుభవం ఉన్న అల్లు అరవింద్ రిస్క్ చేసి కొన్నిసార్లు కొడుకుకోసం లెక్కకు మించిన బడ్జెట్ కూడా పెట్టాడు . అయిన పెద్దగా ఫ‌లితం రాలేదు. అయితే కథల సెలక్షన్ లో శిరీష్ కాస్త బిన్నంగానే ఆడుగులు వేస్తున్నప్ప‌టికీ మంచి విజ‌యాలు రాక‌పోవ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తుంది.

ప్ర‌స్తుతం రాకేశ్ శ‌శి ద‌ర్శ‌క‌త్వంలో ప్రేమ కాదంట అనే రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ చేస్తున్నాడు శిరీష్‌. ఇందులో అను ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్‌గా కనిపించనుంది. ఇటీవలే రిలీజైన ఫస్ట్‌ లుక్‌కు అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చిన విషయం తెలిసిందే!ఈ సినిమాతో ఎలాగైనా హిట్ టాక్ ను అందుకోవాలని శిరీష్ ఫిట్నెస్ విషయంలో భారీగా మార్పులు చేస్తున్నాడు.

ఇటీవల ఒక వర్కౌట్ వీడియో రిలీజ్ చేయగా అందులో నెవర్ బిఫోర్ అనేలా కండలు పెంచినట్లు అర్ధ‌మ‌వుతుంది. అయితే ఎప్పటిలాగే వర్కవుట్స్‌ చేస్తుండగా ఆయన మెడకు దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అతడే ఫొటోతో సహా స్వయంగా సోషల్‌ మీడియాలో వెల్లడించాడు. ఇది ఫ్యాషన్‌ కోసం పెట్టుకుంది కాదు, స్ట్రెంత్‌ ట్రైనింగ్‌ తీసుకుంటున్నప్పుడు నిజంగానే మెడకు దెబ్బ తగిలింది” అని ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో ఫొటో షేర్‌ చేశాడు శిరీష్‌.

అల్లూ వార‌బ్బాయి గాయ‌ప‌డ‌డ్డాడ‌ని తెలిసి అభిమానులు ఆందోళన చెందగా, మరి కొంద‌రు ఆయ‌న‌కు క్షేమ స‌మాచారం తెలిజ‌యేస్తున్నారు. కాగా, ప్రేమ కాదంట సినిమాపై అల్లు శిరీష్ ఎంతో నమ్మకంతో కష్టపడుతున్నాడు. మరి ఆ సినిమా ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. రాకేష్ శశి ఇంతకుముంది కళ్యాణ్ దేవ్ తో విజేత అనే సినిమా చేసిన విషయం తెలిసిందే.