CARONA: రెండు సార్లు క‌రోనా టెస్ట్‌.. నెగెటివ్ వ‌చ్చింద‌న్న అల్లూవార‌బ్బాయి

CARONA ప్ర‌స్తుతం దేశంలో క‌రోనా సెకండ్ వేవ్ ఉదృతి భీబ‌త్సంగా ఉంది. రోజుకు ల‌క్ష‌ల్లో కేసులు, వేల‌ల్లో మ‌ర‌ణాలు సంభ‌విస్తుండ‌డంతో రానున్న రోజుల‌లో ఏం జ‌రుగుతుందో అని భ‌యం క‌లుగుతుంది. ఒక్క సామాన్యులే కాదు ప్ర‌ముఖులు సైతం క‌రోనా బారిన ప‌డి క‌న్నుమూస్తున్నారు. ఇంకొంద‌రు క‌రోనాతో బాధ‌ప‌డుతూ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. టాలీవుడ్ ఇండ‌స్ట్రీకి చెందిన చాలా మంది ప్ర‌ముఖులు ఇప్ప‌టికే క‌రోనా బారిన ప‌డ‌గా, రీసెంట్‌గా అల్లు అర్జున్ క‌రోనా బారిన ప‌డ్డారు. ఈ విష‌యాన్ని త‌న సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేశారు. త‌న‌ను క‌లిసిన వారు ప‌రీక్ష చేయించుకోవాల‌ని కూడా కోరాడు.

బ‌న్నీకి కరోనా రావ‌డంతో ఆయ‌న సోద‌రుడు అల్లు శిరీష్ గురువారం, శుక్ర‌వారాల‌లో క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకున్నాడు. ఈ రెండు పరీక్ష‌ల‌లో కరోనా నెగెటివ్ వ‌చ్చింద‌ని శిరీష్ పేర్కొన్నాడు. పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయిన వ్య‌క్తుల‌ని క‌లిసి ఉండొచ్చ‌నే భావ‌న‌తో క‌రోనా ప‌రీక్ష చేయించుకున్నాను. నెగెటివ్ అని వ‌చ్చింది. మీ ప్రేమ‌కు ధ‌న్య‌వాదాలు అంటూ శిరీష్ పేర్కొన్నారు. క‌రోనా వ‌ల‌న ప్ర‌స్తుతం సినిమాలేవి చేయ‌ని శిరీష్ రానున్న రోజుల‌లో స‌రికొత్త ప్రాజెక్ట్‌ని మొద‌లు పెట్ట‌నున్న‌ట్టు తెలుస్తుంది.

Advertisement