అల్లువార‌బ్బాయి నుండి రొమాంటిక్ పోస్ట‌ర్.. మే 30న ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్

అల్లు అర‌వింద్ త‌న‌యుడిగా ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యువ క‌థానాయ‌కుడు అల్లు శిరీష్‌. కెరీర్‌లో 5 సినిమాలు చేసిన‌ప్ప‌టికీ ఏ సినిమా పెద్ద‌గా హిట్ కాలేదు. దీంతో మంచి స‌క్సెస్ కోసం ఇంకా త‌పిస్తూనే ఉన్నాడు. 2019 సమ్మర్ లో వచ్చిన ‘ఏబీసీడీ’ తర్వాత ఆయన్నుంచి మరో సినిమా రాలేదు. ఇటీవల ‘విలాయటి శరాబ్’ అనే హిందీ మ్యూజిక్ వీడియోతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక కొన్నాళ్లుగా ఓ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉండ‌గా, ఆ సినిమా కోసం త‌న మేకొవ‌ర్‌ని పూర్తిగా మార్చుకుంటున్నాడు.

శిరీష్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న 6వ సినిమాకు సంబంధించి అనౌన్సమెంట్ ఇచ్చిన మేకర్స్.. ఓ రొమాంటిక్ పోస్టర్ ని విడుదల చేశారు. ఇందులో హీరోహీరోయిన్ల ఫేస్ కనిపించకుండా.. చేతులు అడ్డుపెట్టి ముద్దు పెట్టుకుంటున్నారు. ఈపోస్ట‌ర్‌ని చూస్తుంటే మూవీ ఓ రొమాంటిక్ స్టోరీ అని అర్ద‌మ‌వుతుంది. ఫ‌స్ట్ లుక్ అల్లు శిరీష్ పుట్టినరోజు సందర్భంగా మే 30న ఉదయం 11 గంటలకు విడుద‌ల చేయ‌నున్నారు. ఇందులో శిరీష్ సరసన గార్జియస్ బ్యూటీ అను ఇమ్మాన్యుల్ హీరోయిన్ గా నటిస్తోంది. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందుతోంది. రాకేష్ శశి దర్శకత్వంలో సినిమా రూపొందుతున్న‌ట్టు తెలుస్తుండ‌గా, ఫ‌స్ట్ లుక్‌తో అన్ని అనుమానాల‌కి క్లారిటీ వ‌స్తుంది.