Bigg boss siri: సిరికి ప్రియుడు పంపిన లేఖ ఇదే.. ఇంత ప్రేమ‌గా రాసిన లేఖ క్ర‌ష్ అయిపోయిందిగా..!

Bigg boss siri: బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్న కంటెస్టెంట్స్ ఫ్యామిలీకి దూర‌మై 50 రోజులు అయింది. వారు ఫ్యామిలీ గుర్తొచ్చిన‌ప్పుడ‌ల్లా తెగ బాధ‌ప‌డుతూ క‌న్నీరు పెట్టుకుంటున్నారు. ఈ క్ర‌మంలో బిగ్ బాస్ నామినేష‌న్ ప్ర‌క్రియ‌లో భాగంగా ఇంటి స‌భ్యులు రాసిన లేఖ‌ల‌ని పంపాడు అయితే ఇక్క‌డ‌ ఒకరి కోసం మరొకరు త్యాగం చేయాల్సి వచ్చింది.

TheNewsQube-
siri married her boyfriend 3
siri married her boyfriend 3

మొదటగా పవర్‌ రూమ్‌లోకి వెళ్లిన మానస్‌, శ్రీరామ్‌లకు లోబో, ప్రియాంక లేఖలు అందాయి. దీంతో లోబో భార్య వద్ద నుంచి వచ్చిన లేఖను త్యాగం చేసి.. ప్రియాంకకు ఇచ్చాడు.. తర్వాత షణ్ను- రవిలకు విశ్వ, సిరి లేఖలు అందాయి. అయితే విశ్వ కోసం తన ప్రియుడు శ్రీహాన్‌ రాసిన లేఖను ముక్కలు చేయడానికి సిద్ధపడింది సిరి.

siri married her boyfriend 2
siri married her boyfriend 2

నాకు పుట్ట‌క‌పోయిన నా ద‌గ్గ‌ర బాబు ఉన్నాడు.ఆ బాధ, త‌ప‌న నాకు తెలుసు అంటూ విశ్వ‌కు లేఖ అందించ‌మ‌ని చెప్పింది. సిరి చేసిన త్యాగానికి ప్రేక్షకులు కూడా ఫిదా అయ్యారు. ఇదిలా ఉంటే.. తాజాగా సిరి కోసం ప్రియుడు శ్రీహాన్‌ రాసిన లెటర్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

సిరి లేఖ క్ర‌ష్ కావ‌డంతో అందులో ఏముందో సిరి సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు.ఆమె ప్రియుడు ఎంతో ప్రేమ‌గా ఆ లేఖ‌లో రాసుకోచ్చాడు. ‘హాయ్‌ సిరి మన ఏడేళ్ల రిలేషన్‌లో ఇన్ని రోజులు దూరంగా ఉంటామని ఎప్పుడూ అనుకోలేదు. నువ్వు నా పక్కన లేకపోయినా మన లవ్‌ను ఫీల్‌ అవుతున్నాను. మా అమ్మ నాన్న తర్వాత నా గురించి ఎక్కువగా ఆలోచించేది ఎవరైనా ఉన్నారంటే అది నువ్వే.

మనం బాగున్నప్పుడు అందరూ మనల్ని నమ్ముతారు.కానీ నా దగ్గర ఏమి లేనప్పుడు కూడా నువ్వు నన్ను నమ్మావు సిరి. నీ నవ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు ఏడుస్తుంటే చూడలేకపోతున్నా. హ్యాపీగా ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. నువ్వు బయటకు వచ్చాక పెళ్లిచేసుకొని జీవితాంతం కలిసుందాం’అంటూ శ్రీహాన్‌ తన ప్రేమలేఖను సిరికి అందించాడు.