Siri Hanmanth: త‌ల్లి ఏమ‌న్నా ప‌ద్ద‌తిగా ఉందా, కూతురు ఉండ‌డానికి.. క‌న్నీరు పెట్టుకున్న సిరి

Siri Hanmanth: బిగ్ బాస్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న హౌజ్‌మేట్స్ ప‌లు సంద‌ర్భాల‌లో వారి జీవితాల‌కు సంబంధించి ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలియ‌జేస్తున్నారు. ఈ రోజు తమకు జరిగిన అవమానాలు, బాధలు, విజయాలు, అపజయాల గురించి ప్రేక్షకులతో పంచుకున్నారు. ముందుగా వీజే సన్నీ మాట్లాడుతూ… ముగ్గురు అబ్బాయిలను తన తల్లి ఒక్కరే పెంచారని, అది ఎంతో కష్టమైన పని అని, తల్లి త్యాగాన్ని గుర్తు చేసుకున్నారు.Siri Hanmanth

TheNewsQube-

నాకు పుట్టుకతోనే గొంతు స‌మ‌స్య ఉంద‌ని జెస్సీ అన్నాడు. అది దేవుడు ఇచ్చిన సమస్య. అయినప్పటికీ నేను ఫ్యాషన్ ఐకాన్ గా ఎదిగాను. గిన్నిస్ బుక్ రికార్డు సాధించాను. నేషనల్ అవార్డ్స్ కూడా వచ్చాయి. అయినా మా అమ్మ ఇప్పటికీ నా కొడుకు మోడల్ అని చెప్పుకోదు అని జెస్సీ అన్నాడు.

ప్రియ మాట్లాడుతూ… పెళ్లి తరువాత యాక్టింగ్ మానేశా. వెంటనే ఓ బాబు పుట్టాడు. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. లైఫ్ లో సెటిల్ కాలేదు… అని ప్రియ ఎమోష‌న‌ల్ అయింది. ఇక సిరి తన ఊరిలో జరిగిన అవమానాన్ని గుర్తు చేసుకుంది. కొందరు సిరిని ఉద్దేశిస్తూ తల్లి పద్దతిగా ఉందా, కూతురు పద్దతిగా పెరగడానికి అని అవమానకర వ్యాఖ్యలు చేశారట.

నేను ప‌ద్ద‌తిగానే పెరిగాను. ప‌ద్ద‌తిగానే ఉంటాను అని సిరి బాధ‌ను వ్య‌క్త‌ప‌ర‌చింది. ఇక రవి మాట్లాడుతూ… జీవితంలో నువ్వు ఇది సాధించలేవు, నీ వల్ల కాదు అని అవమానించిన వారు మనల్ని చూసి తలదించుకున్నప్పుడే అసలైన శాటిస్ఫాక్షన్ ఉంటుంది అన్నాడు

ఎవరు ఏమన్నా వాళ్ళ ముఖంపై ఒక చిరు నవ్వు చిందిస్తే చాలని విశ్వ చెప్పగా, రెండు తెలుగు రాష్ట్రాల్లో తన గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారన్న అభిప్రాయం లోబో వెల్లడించారు. తాజాగా విడుదలైన ప్రోమోలో ఈ ఆసక్తికర విషయాలు చోటుచేసుకున్నాయి.