Sunitha: సింగర్ సునీతకు.. వింత అనుభవం..

Sunitha: సింగర్-కమ్-డబ్బింగ్ ఆర్టిస్ట్-కమ్-సెలెబ్రిటీ సునీత ఉపద్రష్టకు ఒకసారి ఒక వింత అనుభవం ఎదురైంది. ఆ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించారు. సునీత ఓ సినిమాకు డబ్బింగు చెప్పటానికి ఒక స్టూడియోకి వెళ్లినప్పుడు ఈ సంఘటన జరిగింది. ఆ సందర్భంలో ఓ దర్శకుడు ఆమెతో చిత్రవిచిత్రంగా వ్యవహరించాడు. ముందుగా ‘హలో మేడం’ అంటూ గౌరవంగా పలకరించిన సదరు డైరెక్టరు ఆ తర్వాత ‘నేను మీకు అభిమానినండి’ అంటూ పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే ‘సునీత’ అంటూ ఏకవచనంలో పిలవటం మొదలుపెట్టాడు. దీంతో ఆమె షాక్ కి గుయ్యారు. ‘‘ఈ మనిషేంటి?. అపరిచితుడు సినిమాలో హీరో విక్రమ్ క్యారెక్టర్ మాదిరిగా రకరకాలుగా ప్రవర్తిస్తున్నాడు?’’ అని మనసులో అనుకున్నారు.

Singer Sunitha

అనంతరం.. మరీ క్లోజ్ గా..

ఆ మహానుభావుడు ‘సునీత’ అంటూ పిలవటంతోనే ఆపేయకుండా ఆ తర్వాత కొన్ని డబ్బింగ్ సెషన్స్ అయ్యాక మరింత క్లోజ్ గా మూవ్ అయ్యాడు. సలహాలు సూచనలు ఇస్తూ ‘అరేయ్.. కన్నా.. బుజ్జి..’ అని కూడా అన్నాడు. మధ్య మధ్యలో మేడం అని పిలవటం మర్చిపోయేవాడు కాదు. వెంటనే అరేయ్.. బుజ్జి.. అంటూ ఒకటే చిరాకు పెట్టేవాడు. ఎలాగోలా ఆ మూవీ డబ్బింగ్ అయిపోవటంతో సునీత సురక్షితంగా బయటపడ్డారు. అదృష్టం ఏంటంటే ఆమె కెరీర్ లో మళ్లీ అతను తారసపడలేదు. అప్పట్లో పీకల దాకా కోపం తెప్పించిన, పీడకలలా వెంటాడిన ఆ సంఘటన ఇప్పుడు గుర్తొచ్చినప్పుడల్లా నవ్వొస్తోందని సునీత తెలిపారు.

ఇంతకీ ఎవరతను?..

ఇన్ని విషయాలను పంచుకున్న సునీత అసలా డైరెక్టర్ ఎవరో చిన్న క్లూ కూడా ఇవ్వలేదు. దీంతో.. ఆమె పట్ల ఇలా ఛాదస్తంగా, అతి చనువుగా బిహేవ్ చేసిన ఆ వ్యక్తికి అప్పటికే వయసు మీద పడి ఉంటుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. ముసలోళ్లయితేనే అలా చేస్తారని అంటున్నారు. వయసులో ఉన్నోళ్లు ఆవిధంగా ఇబ్బందిపెడితే సునీత అప్పుడే సీరియస్ గా క్లాస్ తీసుకునేవారని చెబుతున్నారు. పెద్దవాడు కాబట్టే వయసుకు గౌరవం ఇచ్చి వదిలేసి ఉంటారని అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సునీత ఉపద్రష్ట అప్పుడప్పుడూ ఇలాంటి ఆసక్తికర విషయాలను పేర్కొంటూ ఉంటారు.

Advertisement