Sunitha: తల్లిగా తన బాధ్యత నెరవేరుస్తున్న సింగర్ సునీత.. ఆస్తుల పంప‌కాలు మొద‌లు!

Sunitha సింగర్ సునీత..సంగీతానికి మారు పేరు. ఆమె స్వరం అంటే సంగీత ప్రియులకు ఎనలేని అభిమానం. అయితే ప్రపంచానికి వినిపించే పేరు ఒకటి.. తనలో తాను పడే మధనం మరొకటి. సింగర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న సునీత.. జీవితంలో మాత్రం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కున్నారు. తన మొదటి వివాహంలో విఫలమయిన సునీత ఇటీవల రామ్ వీరపనేనితో కలిసి నూతన జీవితంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇక తన పిల్లల భవిష్యత్ గురించి కూడా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

తన భర్త రామ్ వీరపనేని కూడా తన పిల్లల భవిష్యత్ విషయంలో సపోర్ట్ చేస్తారని.. ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే రామ్ వీరపనేని ఆస్తిలో కొంత భాగాన్ని సునీత కూతురికి.. కొడుకుకి ఇవ్వాలని నిర్ణయించుకున్నారని అంటున్నారు. సునీత కుమారుడు ఆకాష్ కి ఓ ఫామ్ హౌస్ తో పాటు తన ప్రాపర్టీలో ఒక ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. అయితే ఈ వార్తలు ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. కానీ వీటి పై ఎలాంటి అధికారక ప్రకటన రాలేదు.

కారణాలు ఏవైనా సమాజంలో ఒంటరి తల్లిగా పిల్లల్ని పెంచడం.. వారి భవిష్యత్ పై ప్రణాళిక ఉండటం అనేది ఎంతో కష్టమైన విషయం. ఈ నేపథ్యంలోనే సింగర్ సునీత మరోపెళ్ళితో సేఫ్ జోన్ లోకి వెళ్ళారు. ఇన్నాళ్ళు ఎంతో ధైర్యంగా నెట్టుకొచ్చారు. ఇప్పుడు మంచి మనసున్న వ్యక్తి రామ్ వీరపనేని ఆమె జీవితంలోకి వెళ్ళడం.. సునీత పిల్లల భాధ్యతను తీసుకోవడంతో సంతోషంగా ఉన్నారు. దీంతో పాటు ఆమె భర్త సహకారంతో ఆమె పిల్లల భవిష్యత్ బావుంటుందని ఆశిస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే ఆమె పిల్లలకు ఆకాష్, శ్రేయ లు వారికి నచ్చినవిధంగా ఎదుగుతూ.. తమ సొంత కాళ్ళ మీద నిలబడేలా చేయడమే తల్లిగా తన ముందున్న లక్ష్యం అంటూ ఇంతకుముందు చాలా సంధర్భాల్లో తెలిపారు. ప్రస్తుతం ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది.

Advertisement