Noel: రెండో పెళ్ళికి సిద్దమైన సింగర్ నోయల్..?

Noel: యంగ్ సింగర్, డాన్సర్, నటుడుగా ప్రేక్షకులను అలరించారు నోయల్ సేన్. బిగ్ బాస్ సీజన్ 4 లో హౌజ్ మేట్ గా ఎంట్రీ ఇచ్చి.. బుల్లితెర ప్రేక్షకుల అభిమానాన్ని పొందారు. ఆయన వ్యక్తిగత జీవితంలో ప్రేమ పెళ్లి చేసుకున్నా.. కొన్ని వివాదాల వల్ల విడాకులు తీసుకున్నారు. హీరోయిన్ ఎస్తర్ ను లవ్ మ్యారేజ్ చేసుకున్న నోయల్ పెళ్ళి అయిన కొన్ని నెలలకే విడిపోయారు. ఆ తర్వాత బిగ్ బాస్ షోలో మరింత క్రేజ్ ను సంపాదించుకున్నారు.

Singer Noel Second Marriage
Singer Noel Second Marriage

అప్పటి వరకు ఒక సింగర్ గా మాత్రమే తెలిసిన నోయల్.. బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చాక వ్యక్తిగతంగా తాను ఎంత మంచివాడనేది అర్థమైంది. అయితే ప్రేక్షకులు కూడా ఎంతో అభిమానించడం.. ఓట్లు వేయడం జరుగుతుండగానే, నోయల్ కు అనారోగ్యం కారణంగా బయటకు వచ్చేశారు.

అతని మంచితనంతో అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. తన స్టైల్ ఆటతో ప్రత్యేకంగా నిలిచారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్ కు టచ్ లో ఉంటున్నారు. ఈ క్రమంలో బిగ్‌బాస్‌ ఇంటి నుంచి బయటకు వచ్చిన నోయల్‌కు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ వచ్చింది. లైవ్ చాట్ లో.. ట్వీట్స్, ఇన్ స్టాగ్రామ్ పోస్టులకు.. గతంలో నోయల్ పాడిన పాటలు, వీడియోస్ ఇలా అన్నిటినీ విపరీతంగా షేర్, లైక్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు నోయల్ చేసిన లేటెస్ట్ పోస్ట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.

ఓ ఎగ్జైటింగ్ న్యూస్ మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను.. ఈ విషయం చెప్పాలని ఎంతో ఆత్రుతగా ఉంది.. అస్సలు వెయిట్ చేయలేకపోతున్నాను అంటూ ట్వీట్‌ చేశాడు నోయల్‌. ఈ పోస్ట్ కి మీనింగ్ ఏమై ఉంటుందా అని తెగ ఆలోచనలో పడ్డారు అభిమానులు. ఒకవేళ నోయల్ మళ్ళీ పెళ్ళి చేసుకోబోతున్నారు అంటూ కొంతమంది ట్వీట్ చేస్తే.. బహుశా ఏదైనా సినిమా అప్డేట్ అయ్యి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా నోయల్ ఓ సూపర్ ఇంట్రెస్టింగ్ న్యూస్ త్వరలోనే చెప్పబోతున్నాడు. అదేంటో తెలియాలంటే కాస్త వెయిట్ చేయాల్సిందే మరి.