Singer Mano: సింగ‌ర్ మ‌నో కుమారులిద్దరు హీరోలు అన్న విష‌యం మీకు తెలుసా?

Singer Mano: సింగ‌ర్‌గానే కాకుండా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకున్నారు మ‌నో. ఈయ‌న అస‌లు పేరు నాగూర్ బాబు. సినిమాల్లోకి వ‌చ్చాక కొన్ని రోజులకు మ‌నోగా పేరు మార్చుకున్నారు. గాయకుడు కాకముందు చక్రవర్తి దగ్గర సహాయకుడిగా పనిచేసారు. అంతేకాదు దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో కలిసి ఎన్నో వేల ప్రదర్శనలు ఇచ్చారు.

Singer Mano Sons are Actors in movie IndustrySinger Mano Sons are Actors in movie Industry
Singer Mano Sons are Actors in movie Industry

తాజాగా మనో ఆలీతో స‌ర‌దాగా కార్య‌క్ర‌మానికి త‌న స‌తీమ‌ణి జ‌మీలాతో వ‌చ్చి ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించారు.మ‌నో సింగ‌ర్‌గానే కాకుండా పలు సంగీత సంబంధ ప్రోగ్రామ్‌లకు కూడా జడ్జ్‌గా వ్యవహరించారు. నటుడిగాను మెప్పించారు. రీసెంట్‌గా క్రేజీ అంకుల్స్ చిత్రంతో ఆక‌ట్టుకున్నాడు. ఇక ర‌జ‌నీకాంత్‌కు డ‌బ్బింగ్ చెబుతూ అన్నిభాష‌ల‌లో మంచి పేరు ప్రఖ్యాత‌లు పొందారు.

Singer Mano Sons are Actors in movie Industry
Singer Mano Sons are Actors in movie Industry

తెలుగుతో పాటు తమిళం, కన్నడ, బెంగాలీ సహా 11 పైగా భాషల్లో మ‌నో పాటలు పాడారు. అంతేకాదు నటుడిగా ఈయన గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా ఈయన గురించి సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు.ఈయనది సంప్రదాయ ముస్లిమ్ కుటుంబం. మనో తండ్రి పేరు రసూల్. తల్లి పేరు షహీదా. మనో గారి తండ్రి ఆలిండియా రేడియోలో పనిచేసేవారు.

కెరీర్ మొదట్లో ఇళయరాజా ఎక్కువగా మనోతో పాటలు పాడించేవారు. అంతేకాదు నాగూరు బాబును మనోగా మార్చింది ఇళయరాజానే. మహేష్ బాబు తొలి చిత్రం ‘నీడ’లో నటించారు మ‌నో. సింగర్‌గా మురళీ మోహన్ నటించిన ’కర్పూర దీపం’తో గాయకుడిగా ప్రస్థానం మొదలు పెట్టారు. ఈయనకు జమీలాతో 19 ఏళ్ల వయసులో 1985లో పెళ్లైంది. అయితే వీరి పెళ్లికి సంగీత దర్శకులు ఇళయరాజా, చక్రవర్తి సాక్షి సంతకాలు చేయడం విశేషం.

సింగర్ మనోకు ముగ్గురు కుమారులు, ఒక అమ్మాయి. ఒక అబ్బాయి.. నాలుగేళ్ల వయసులో ప్రమాదవ శాత్తు కన్నుమూసారు. మనో పెద్ద కుమారుడు షకీరా తమిళ సినిమాల్లో నటిస్తున్నారు. ఇక రెండవ కుమారులు రతేష్ సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. అమ్మాయి సోపికా అమెరికాలో స్వరాభిషేకంలో తన గళాన్ని వినిపిస్తోంది. కరోనా కారణంగా మనో కుమారులు నటించిన సినిమాలు విడుదల కాలేకపోయాయి.