Singer Mangli : దిమ్మ తిరిగే ఆఫర్ కొట్టేసిన సింగర్ మంగ్లీ.. పాన్ ఇండియా సినిమాలో హీరోయిన్ గా..!
NQ Staff - January 19, 2023 / 10:30 AM IST

Singer Mangli : సినీ ఇండస్ట్రీ అంటేనే మాయా ప్రపంచం. ఇక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం చాలా కష్టం. ఎప్పుడు ఎవరు స్టార్ అవుతారో చెప్పలేం. ఒక్కొక్కరికి ఒక్కో విధంగా అవకాశం వస్తూ ఉంటుంది. ఇప్పుడు సింగర్ మంగ్లీకి దిమ్మ తిరిగే ఛాన్స్ వచ్చింది. ఆమె గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. మొదట్లో న్యూస్ ఛానెల్లో చేసిన ఆమె ఆ తర్వాత స్టార్ సింగర్ గా ఎదిగింది.
ఫోక్ సాంగ్స్ పాడటం దగ్గరి నుంచి మొదలు పెట్టి సినిమాల్లో ఐటెం సాంగ్స్ పాడే స్థాయికి ఎదిగింది. చాలా తక్కువ టైమ్‌లోనే మంచి సింగర్ గా పేరు తెచ్చుకుంది. తనకు ఛాన్స్ వచ్చిన ప్రతి పాటతో ఆమె సూపర్ హిట్ అందుకుంది. కేవలం తెలుగులోనే కాకుండా కన్నడంలో కూడా ఆమెకు చాలానే అవకాశాలు వచ్చాయి.
యదార్ఘ సంఘటన ఆధారంగా..
అక్కడ కూడా ఆమె వందలాది పాటలు పాడింది. ఈ క్రమంలోనే ఆమె సినిమాల్లో కూడా నటించాలని ఆశ పడుతోంది. అయితే ఆమెకు ఇప్పుడు ఓ బంపర్ ఆఫర్ దక్కింది. కన్నడలో ఇప్పుడు ఓ భారీ పాన్ ఇండియా మూవీ తెరకెక్కబోతోంది. 2013-14 లో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా ఈ పాన్ ఇండియా సినిమాను తీస్తున్నారు.
ఇందులో నాగ శేఖర్ హీరోగా చేస్తున్నాడు. చక్రవర్తి చంద్ర చూడ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీలో మంగ్లీ హీరోయిన్ గా ఎంపిక అయిందంట. ఈ విషయం ఇప్పుడు కన్నడ మీడియాతో పాటు తెలుగు మీడియాలో వైరల్ అవుతోంది. అదే నిజమైతే ఆమెకు తిరుగుండదనే చెప్పుకోవాలి. ఎంతైనా ఆమె స్టోరీ ఎంతో మందకి ఇన్ స్పిరేషన్ కదా.