Saranga Dariya: సారంగ‌ద‌రియా వివాదానికి ముగింపు ప‌లికిన శేఖ‌ర్ క‌మ్ముల‌.. !

Saranga Dariya ఇటీవ‌లి కాలంలో బుట్ట‌బొమ్మ బుట్టబొమ్మ అనే పాట త‌ర్వాత సంగీత ప్రేక్ష‌కులని ఎక్కువ‌గా అల‌రించిన పాట సారంగ‌ద‌రియా. నాగ చైత‌న్య‌, సాయి ప‌ల్ల‌వి ప్ర‌ధాన పాత్ర‌ల‌లో శేఖ‌ర్ క‌మ్ముల తెరకెక్కించిన ల‌వ్ స్టోరీ సినిమా కోసం ఈ పాట‌ను రూపొందించ‌గా, దీనికి సుద్దాల అశోక్ తేజ లిరిక్స్ అందించారు. మంగ్లీ ఆల‌పించింది. రీసెంట్‌గా విడుద‌లైన ఈ పాటు 57 మిలియ‌న్స్‌కు పైగా వ్యూస్ రాబట్టి అంద‌రిని షాక్‌కు గురి చేస్తుంది. సాయి ప‌ల్ల‌వి డ్యాన్స్ మూమెంట్స్‌కు తోడు మంగ్లీ గాత్రం తోడు కావ‌డంతో తెలుగు ప్రేక్ష‌కులే కాదు త‌మిళం, హిందీ, మ‌ల‌యాళంకు చెందిన సినీ ప్రియులు కూడా ఈ పాట‌ని ఫుల్‌గా ఎంజాయ్ చేస్తూ స్టెప్పులు వేస్తున్నారు.

సారంగ‌ద‌రియా పాట సూప‌ర్ హిట్ కావ‌డంతో ఇది ప్ర‌తి ఒక్క‌రి గుండెల‌లో నిలిచిపోయింది. అయితే ఈ పాట‌ పై రేగిన వివాదం అభిమానుల‌ని కాస్త నిరాశ‌ప‌ర‌చింది. కోమ‌లి అనే జాన‌ప‌ద సింగ‌ర్ .. ఈ పాట‌ను వెలుగులోకి తెచ్చింది త‌నే అని చెప్పుకొచ్చింది. మా అమ్మ‌మ్మ ద‌గ్గ‌ర నుండి తీసుకున్న ఈ పాట‌ను రేలారే రేలా ప్రోగ్రాంలో జడ్జిగా ఉన్న సుద్దాల అశోక్ తేజ ముందు పాడాను. ఇప్పుడు ఆ పాట‌ను నా అనుమ‌తి లేకుండా ల‌వ్ స్టోరీ సినిమా కోసం వాడారు. దీనిపై స‌ర్వ‌హ‌క్కులు నాకే ఉన్నాయి. ఈ విష‌యంలో న్యాయం జ‌రిగే వ‌ర‌కు పోరాడుతూనే ఉంటాను అని ప‌లు మీడియా ఛానెల్స్ ముఖంగా త‌న బాధ‌ను చెప్పుకుంది కోమ‌లి.

అయితే కోమ‌లి చేస్తున్న డిమాండ్‌పై రీసెంట్‌గా త‌న ఫేస్ బుక్‌లో స్పందించారు శేఖ‌ర్ క‌మ్ముల‌. ఆమెను ముందుగా సంప్ర‌దించాం, పాడ‌మ‌ని ముందుగా త‌న‌కే చెప్పాం. అనారోగ్యం వ‌ల‌న రాలేన‌ని చెప్పారు. త‌న‌కు న్యాయం జ‌రిగేలా చూస్తాం అంటూ త‌న సోష‌ల్ మీడియాలో పేర్కొన్నారు శేఖ‌ర్ క‌మ్ముల‌. ఇక రీసెంట్‌గా కోమ‌లిని త‌న వ‌ద్ద‌కు పిలిపించుకొని అన్ని విష‌యాలు మాట్లాడారు శేఖ‌ర్. త‌ర్వాతి సినిమాలో ఛాన్స్ ఇవ్వ‌డంతో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆ పాట పాడిస్తాను అని ద‌ర్శ‌కుడు అభ‌యం ఇవ్వ‌డంతో కోమ‌లి కూల్ అయింది. ఇప్పుడు ఈ పాట‌కు సంబంధించి మా మ‌ధ్య ఎలాంటి వివాదం లేదంటూ చెప్పుకొచ్చింది. ఇక శేఖ‌ర్ క‌మ్ముల కూడా వివాదం ముగిసింద‌ని చెప్పుకొచ్చారు. ఏదేమైన సారంగ‌ద‌రియా పాట‌తో ల‌వ్ స్టోరీ సినిమాకు ప్ర‌మోష‌న్ బాగానే ల‌భించింది. ఏ ప్రిల్ 16న ఈ చిత్రం విడుద‌ల కానుంది.

Advertisement