Simhadri: సింహాద్రి సినిమా అస‌లు ఎలా పుట్టిందో తెలుసా.. ఈ సినిమా వెనుక మ‌రో సినిమా క‌థ ఉంద‌ట‌..!

Simhadri: నందమూరి వారి వంశోద్ధారకుడు జూనియర్ ఎన్టీఆర్. తాతగారి పేరును నిలబెట్టిన ఘనత ఆయనది. కేవలం వారసత్వాన్ని మాత్రమే కాకుండా ఆయన నటనాభినయాన్ని సైతం అలవరుచుకున్న నటుడు. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ స్పెషల్ క్రేజ్ ని క్రియేట్ చేశారు. బాల్యంలోనే బాలరామాయణంలో రాముడిగా అలరించారు. ఆది సినిమాతో తెలుగు కమర్షియల్ ఇండస్ట్రీకి స్ట్రాంగ్ గా పాదం మోపారు. స్టూడెంట్ నంబర్ వన్ గా నిలిచి అటు కుర్రకారుకు.. ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేశారు. ఆ తర్వాత తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సింహాద్రి సినిమాతో టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ స్పెషల్ మార్క్ ని సృష్టించారు. అప్పటి వరకు స్లోగా ఉన్న ఎన్టీఆర్ కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. అలా 2003 లో రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా 27 కోట్ల రూపాయలకు పైగా బాక్సాఫీస్ దగ్గర రికార్డులు బద్దలు కొట్టింది.

SIMHADRI

ఇంతకు అసలు విషయం ఏంటంటే.. ఈ సినిమా కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ లేటెస్ట్ ఇంటర్వ్యూలో ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు. ఈ సినిమా కథ ఇప్పటిది కాదట. అలాగే ఈ కథని బాలయ్య బాబు కోసం రాసిన కథ. అయితే ఆయనకు ఈ కథ నచ్చకపోవడంతో సెట్స్ మీదకు వెళ్ళలేదని చెప్పారు విజయేంద్రప్రసాద్. ప్రముఖ నిర్మాత దొరస్వామి రాజుతో రాజమౌళి ఒక సినిమాని తెరకెక్కించాలని అనుకున్నారు. ఆ సమయంలో ఈ కథ గురించి ప్రస్తావించడం. హీరోగా జూనియర్ ఎన్టీఆర్ సెట్ అవ్వడం అన్నీ ఫాస్ట్ గా జరిగిపోయాయి. అలాగే ఈ కథను మొదలుపెట్టడానికి మరో బలమైన కారణం ఉందని చెప్పారు రచయిత విజయేంద్ర ప్రసాద్.

చెన్నైలో ఓసారి రచయిత విజయేంద్ర ప్రసాద్ తన అసిస్టెంట్ తో కలిసి వసంత కోకిల సినిమా చూస్తున్నప్పుడే ఈ సింహాద్రి సినిమా స్టోరీ ఆలోచన వచ్చిందట. ఎందుకంటే వసంత కోకిల సినిమా క్లైమాక్స్ లో హీరోయిన్ శ్రీదేవి, కమల్ హాసన్ ను పొడిచి వెళ్ళిపోవడాన్నే సింహాద్రి స్టోరీకి ఇంటర్వెల్ బ్యాంగ్. అలా కథ రాయడం మొదలయ్యింది. అదన్నమాట విషయం. సింహాద్రి ఇంటర్వెల్ లో భూమిక గునపంతో జూనియర్ ఎన్టీఆర్ గుండెల్లో పొడుస్తుంది. ఈ ఎపిసోడ్ కి ముందు ఏమైంది.. ఆ తర్వాత ఏమైంది అనేది సింహాద్రి కథ.

SIMHADRI