SIMHA: 11 ఏళ్ళైనా పవర్ తగ్గలే.. ‘సింహా’ ప్ర‌భంజ‌నం అప్ప‌ట్లో సెన్సేష‌న్

పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది కదా.. పాటొచ్చి పదేళ్లైనా పవర్ తగ్గలే అని. అలాగే బాలయ్య సినిమా విషయంలోనూ ఇదే జరుగుతుంది. ఆరేళ్ళ నుంచి వరస ఫ్లాపుల్లో ఉన్నపుడు బాలయ్య నుంచి ఏ సినిమా వచ్చినా కూడా డిజాస్టర్ అని ప్రేక్షకులు కూడా ఫిక్స్ అయిపోయిన వేళ ఈయన నుంచి వచ్చిన బ్లాక్ బస్టర్ సింహా. బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ చిత్రం ఎప్రిల్ 30, 2010లో విడుదలైంది. అంటే సరిగ్గా 11 ఏళ్ళ కింద అన్నమాట. ఇప్పటికీ ఈ సినిమా గురించి నందమూరి అభిమానులు మాట్లాడుకుంటూనే ఉంటారు. అసలు కథ అంటూ లేకుండా కేవలం మీసం నుంచి ఈ కథను రాసుకున్నాడు దర్శకుడు బోయపాటి శ్రీను. అప్పటికే భద్ర, తులసి సినిమాలతో మంచి ఊపు మీదున్న బోయపాటి.. సింహాతో హ్యాట్రిక్ పూర్తి చేసాడు. తొలి రెండు సినిమాల కంటే కూడా సింహా పెద్ద హిట్ అయింది. అప్పట్లో బయ్యర్లకు లాభాల పంట పండించింది. దానికంటే వారం ముందు విడుదలైన ప్రభాస్ డార్లింగ్ సినిమాను పూర్తిగా డామినేట్ చేసింది సింహా. మరి 11 ఏళ్ళ కింద ఈ సినిమా సాధించిన వసూళ్లను మరోసారి చూద్దాం..

నైజాం-7.10 కోట్లు
సీడెడ్- 7.70 కోట్లు
ఉత్తరాంధ్ర- 3.43 కోట్లు
ఈస్ట్- 1.69 కోట్లు
వెస్ట్- 1.76 కోట్లు
గుంటూరు- 3.70 కోట్లు
కృష్ణా- 1.99 కోట్లు
నెల్లూరు- 1.44 కోట్లు

ఏపీ + తెలంగాణ- 28.81 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్- 2.83 కోట్లు

వరల్డ్ వైడ్ టోటల్ కలెక్షన్స్- 31.64 కోట్లు

అప్పట్లో సింహా సినిమాను 17 కోట్లకు బిజినెస్ చేసారు. దానికి ముందు వచ్చిన బాలయ్య సినిమాలన్నీ డిజాస్టర్ అయినా.. 10 కోట్ల మార్క్ కూడా దాటలేకపోయినా కూడా సింహా సినిమాకు మంచి బిజినెస్ జరిగింది. బోయపాటి ట్రాక్ రికార్డ్.. బాలయ్య లుక్ సినిమాపై హైప్ పెంచేసాయి. విడుదల తర్వాత కూడా అదే కంటిన్యూ అయింది. సింహా ఏకంగా 32 కోట్లు షేర్ వసూలు చేసి.. బయ్యర్లకు ఏకంగా 15 కోట్ల లాభాలు తీసుకొచ్చింది. ఈ సినిమాతో బాలయ్య పూర్తిగా ఫామ్ లోకి వచ్చేసాడు.

Advertisement