Simbu: స్టేజ్ మీద క‌న్నీళ్లు పెట్టుకున్న త‌మిళ హీరో.. ఓదార్చిన సినిమా క్రూడ్‌

Simbu: కోలీవుడ్ హీరో శింబు గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. డ‌బ్బింగ్ సినిమాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ని కూడా ఎంత‌గానో అల‌రించాడు. ఆయ‌న తాజాగా సైన్స్ ఫిక్షన్ పొలిటికల్ యాక్షన్ డ్రామా ‘మానాడు’ అనే చిత్రం చేశాడు. ఈ చిత్రం నవంబర్ 25న థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి చెన్నైలో జరిగింది.

TheNewsQube-
simbu tear ful for puneeth
simbu tear ful for puneeth

ఈ సందర్భంగా శింబు మాట్లాడుతూ.. మూవీ విశేషాలను పంచుకుంటూనే ఒక్కసారిగా కన్నీటిపర్యంతరం అయ్యాడు.వెంకట్‌ ప్రభు, తాను కలిసి సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నామని, అయితే కొన్ని కారణాల వల్ల కుదరలేదన్నాడు. ‘మానాడు’ సినిమాలో వినోదానికి కొదవ ఉండదని, ఈ సినిమా కోసం ఎంతో శ్రమించానని చెప్పాడు. ఇక ఈ సినిమాలో ఎజ్‌జే సూర్య నటన అద్భుతంగా ఉంటుందని శింబు పేర్కొన్నాడు.

అంతేగాక సినిమా విడుదల తర్వాత తన మరో స్థాయికి వెళ్తుందన్నాడు. ఇప్పటి వరకు సరదాగా మాట్లాడిన శింబు ఆ తర్వాత ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకుంటూ తనని కొందరూ టార్గెట్‌ చేశారని, కావాలని ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ చెప్పుకొచ్చాడు.

తన ప్రసంగంలో శింబు భావోద్వేగానికి లోనవుతూ, కన్నీళ్లు పెట్టుకుని అందరినీ షాక్‌కు గురి చేశాడు. ఆ సమయంలో చిత్ర దర్శకుడు వెంకట్ ప్రభు, శింబు స్నేహితుడు, నటుడు మహత్ వేదికపై శింబును ఓదార్చవలసి వచ్చింది. కొందరు వ్యక్తులు తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్లను ప్రస్తావించకుండానే శింబు అన్నారు. “నేను చాలా సమస్యలను ఎదుర్కొంటున్నాను. కానీ వాటన్నింటినీ నేను చూసుకుంటాను. మీరు నన్ను జాగ్రత్తగా చూసుకోండి’’ అంటూ శింబు తన అభిమానులను కోరాడు.

simbu tear ful for puneeth1
simbu tear ful for puneeth1

శింబు ప్రసంగానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు నిమిషాల వ్యవధిలో వైరల్‌గా మారాయి. తమ అభిమాన నటుడు వేదికపైనే ఇలా కన్నీటి పర్యంతం కావడంతో వారు సోషల్ మీడియా వేదికగా అతడిని తమ ప్రేమతో ముంచెత్తారు. గత దశాబ్ద కాలంగా శింబు తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితానికి సంబంధించి అనేక వివాదాలను ఎదుర్కొంటున్నాడు. శింబు సహకరించకపోవడంతో తమిళ నిర్మాతల మండలి ఆయనకు రెడ్ కార్డ్ కూడా జారీ చేసింది.