Chinmayi Sripada: వెండితెరపై సంద‌డి చేయ‌నున్న చిన్మయి.. ఏ హీరోతో న‌టిస్తుందో తెలుసా?

Chinmayi Sripada: సింగ‌ర్ చిన్న‌యి సింగ‌ర్‌గా, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్‌గా ఎంతో మంది ప్రేక్ష‌కుల‌కి పసందైన వినోదం అందించింది. ఈ అమ్మ‌డు స‌మంత‌కు చాలా సినిమాల‌లో డ‌బ్బింగ్ చెప్పింది. స‌మంత స‌క్సెస్‌లో సగ‌భాగం అయిన చిన్న‌యి ఈ మ‌ధ్య ఎక్కువ‌గా మ‌హిళ‌ల‌పై జ‌రుగుతున్న లైంగిక వేధింపుల‌ని ఖండిస్తూ వాటిపై పోరాడుతూ వార్త‌ల‌లోకి ఎక్కుతుంది. అయితే వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా కత‌న అభిమానుల‌కి గుడ్ న్యూస్ చెప్పింది చిన్మయి.

Siger Chinmayi making her first debut in most eligible bachelor
Siger Chinmayi making her first debut in most eligible bachelor

అఖిల్ – మోస్ట్ వాంటెడ్ బ్యూటీ పూజా హెగ్డే జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’. ఈ మూవీతో బిగ్ స్క్రీన్‌పై ప్రముఖ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద ఎంట్రీ ఇస్తున్నారు. వినాయ‌క‌చ‌వితి సంద‌ర్భంగా ఈ విష‌యాన్ని మేక‌ర్స్ తెలియ‌జేశారు. అఖిల్ కోసం తొలిసారి మేకప్ వేసుకుంటుండ‌డంతో సినిమాపై అంద‌రిలో ఆస‌క్తి నెల‌కొంది. చిన్మ‌యి భ‌ర్త న‌టుడు, ద‌ర్శ‌కుడు అన్న సంగ‌తి తెలిసిందే.


అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ . ఈ సినిమాను జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్నారు. భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, పిల్లా నువ్వులేని జీవితం, గీత గోవిందం, ప్ర‌తిరోజు పండ‌గే లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాలతో మోస్ట్ సక్సెస్ ఫుల్ నిర్మాతగా క్రేజ్ సొంతం చేసుకున్న‌ బన్నీ వాసు, మరో నిర్మాత ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వాసు వర్మతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.


ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, పాటలు, పోస్టర్స్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ ప్రకటించిన రోజు నుంచి కూడా ఈ సినిమాపై అక్కినేని అభిమానుల్లో ఆసక్తి మొదలైంది. గోపి సుందర్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. కాగా విజయదశమి పండుగ సందర్భంగా అక్టోబర్ 8న మేకర్స్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు .ఇప్పటి వరకు డబ్బింగ్ ఆర్టిస్ట్, గాయకురాలిగా తనదైన గుర్తింపు సంపాదించుకున్న చిన్మయి.. అఖిల్ సినిమాలో తొలిసారి స్క్రీన్ పై క‌నిపించి ఎలాంటి సంద‌డి చేస్తుందో చూడాలి.