DJ Tillu 2 : ‘టిల్లు’గాని హీరోయిన్.! పూజా హెగ్దే కాదు, అనుపమ.!

NQ Staff - October 24, 2022 / 03:33 PM IST

DJ Tillu 2 : ‘టిల్లు’గాని హీరోయిన్.! పూజా హెగ్దే కాదు, అనుపమ.!

DJ Tillu 2 : ‘డీజే టిల్లు’ సినిమాతో వసూళ్ళ ప్రభంజనమే సృష్టించాడు సిద్దు జొన్నలగడ్డ. అందుకే, ఈసారి సీక్వెల్‌తో వస్తున్నాడు. సీక్వెల్ అనాలా.? ‘టిల్లు’ ఫ్రాంచైజీ అనుకోవాలా.? పేరు ఏదైతేనేం, రెండో టిల్లుగాడు షురూ అయ్యాడు.

దీనికి సంబంధించి ఓ ఇంట్రో వీడియో విడుదల చేసింది చిత్ర యూనిట్. ట్రాఫిక్ పోలీస్‌తో టిల్లుగాడి గొడవ కడుపుబ్బా నవ్వు తెప్పిస్తోంది. అన్నట్టు, మన టిల్లూగాడు తన సినిమాలో హీరోయిన్ పూజా హెగ్దే అనుకున్నాడట.

పూజా హెగ్దే అనుకుని.. అనుపమతో సరిపెట్టుకున్నాడంతే..

అట్లుంటది మనతోని.! ఔను, టిల్లుగానితో అట్లనే వుంటుంది. ‘డీజే టిల్లు’ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్. ఇప్పుడేమో, పూజా హెగ్దే కోసం ట్రై చేశాడట టిల్లూగాడు. అలాగని ఇంట్రో వీడియోలో హీరోతో చెప్పించేశారు.

కానీ, టిల్లుగాన్కి అంత సీన్ లేదని పక్కనే వున్న ఇంకో పాత్రతో చెప్పించేయడం గమనార్హం. అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. నేహా శర్మ ఓ రేంజ్‌లో ‘డీజే టిల్లు’ సినిమాకి స్పైసీనెస్ యాడ్ చేసింది. మరిప్పుడు, అనుపమ ఏం చేయబోతోందో.?

కామెడీ డోస్ అయితే డబుల్ వుంటుందని పక్కాగా ఫిక్సయిపోవచ్చు. టిల్లుగానితో అట్లుంటది మరి. అన్నట్టు, ఈ సినిమాకి ‘టిల్లు స్క్వేర్’ అని పేరు పెట్టారండోయ్.!

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us