Siddhu Jonnalagadda Endured Insults In Film Industry : నా ముఖం మీదనే అలా చెప్పేవారు.. అవమానాలు భరించాః సిద్దు జొన్నలగడ్డ

NQ Staff - June 29, 2023 / 11:41 AM IST

Siddhu Jonnalagadda Endured Insults In Film Industry : నా ముఖం మీదనే అలా చెప్పేవారు.. అవమానాలు భరించాః సిద్దు జొన్నలగడ్డ

Siddhu Jonnalagadda Endured Insults In Film Industry :

సిద్దు జొన్నలగడ్డ గురించి అందరికీ తెలిసిందే. ఆయన ఇప్పుడు మంచి క్రేజ్ ను సంపాదించుకున్న హీరోగా నిలదొక్కుకుంటున్నాడు. ఇప్పుడు డీజేటిల్లు-2 మూవీతో రాబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి. ఆయన ఇలా హీరోగా నిలదొక్కుకోవడానికి పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు.

చిన్న చిన్న పాత్రలతో కెరీర్ స్టార్ట్ చేసి నేడు క్రేజీ హీరోగా మారిపోయాడు. కాగా ఆయన కూడా కెరీర్ స్టార్టింగ్ లో ఎన్నో అవమానాలు భరించాడంట. మరి సినిమా ఇండస్ట్రీ అంటేనే ఎన్నో అవమానాలు భరిస్తే గానీ స్టార్ కాలేరు కదా.. సిద్దుకు కూడా ఇలాంటి పరిస్థితి తప్పలేదంట. ఈ విషయాలను ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

ఆయన మాట్లాడుతూ.. నేను గతంలో సినిమాల్లో హీరోగా మారకముందు నా ఫ్రెండ్ చెప్పిన మాటలు మర్చిపోలేను. నీ ముఖం అంతా మొటిమలు ఉన్నాయి. మచ్చలు, గుంతలు కూడా ఉన్నాయి..సినిమా తీయాలని చూసే నిర్మాత నీలాంటి ముఖం ఉన్న హీరో తో ఎలా సినిమా చేస్తాడు అంటూ అవమానించాడు.

అతనే కాదు చాలామంది ఇండస్ట్రీలో ఇలాగే మాట్లాడారు. కానీ నన్ను నేను ప్రూవ్ చేసుకుని ఈ స్థాయికి వచ్చాను అంటూ తెలిపాడు సిద్దు. కేవలం నటుడిగానే కాకుండా రైటింగ్ విభాగంలో కూడా ఆయన్న సక్సెస్ అవుతున్నాడు. ఇంతటి స్థాయిలో ఆయన ఎదగడం అంటే మాటలు కాదు కదా.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us