Actor Siddharth: మ‌రోసారి బొమ్మ‌రిల్లు హీరోని చంపేశారు..!

Actor Siddharth: బాయ్స్, నువ్వుస్తానంటే నేనొద్దంటానా, బొమ్మ‌రిల్లు వంటి సినిమాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించాడు సిద్ధార్థ్‌. ముఖ్యంగా బొమ్మ‌రిల్లు సినిమాలో ఆయ‌న న‌ట‌న ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో మెప్పించింది. ఇప్ప‌టికీ బొమ్మ‌రిల్లు హీరోగానే తెలుగు ప్రేక్ష‌కుల‌కి గుర్తు ఉన్న సిద్ధార్థ్ చాలా కాలం త‌ర్వాత మ‌హా స‌ముద్రం అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. Rx 100 ఫేమ్ అజయ్ భూపతి రూపొందిస్తున్న ఈ సినిమాలో శర్వానంద్ మరో హీరోగా నటిస్తున్నాడు.


Siddharth Shocked as Netizen Mourns His Death Instead of Late Actor Sidharth Shukla
Siddharth Shocked as Netizen Mourns His Death Instead of Late Actor Sidharth Shukla


సిద్దార్థ్ ఒక‌వైపు సినిమాల‌తో బిజీగా ఉంటూనే మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో సంద‌డి చేస్తుంటాడు.ఇటీవ‌ల ఆయ‌న‌పై నెగెటివ్ ప్ర‌చారం ఎక్కువైంది. యంగ్ ఏజ్‌లో మరణించిన సౌత్‌ ఇండియాకు చెందిన 10 మంది తారలు అంటూ ఓ వీడియో అప్‌లోడ్‌ కాగా.. ఈ వీడియో థంబ్‌నైల్‌పై హీరోయిన్స్ ఆర్తి అగర్వాల్‌, సౌందర్య ఫొటోలతో పాటు హీరో సిద్దార్థ్ ఫొటో కూడా అందులో ఉంచారు. దీనిపై సిద్ధార్థ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.


Siddharth Shocked as Netizen Mourns His Death Instead of Late Actor Sidharth Shukla
Siddharth Shocked as Netizen Mourns His Death Instead of Late Actor Sidharth Shukla


ఇక తాజ‌గా సిద్ధార్థ్ శుక్లా అనే యువ నటుడు, బిగ్‌బాస్‌ విన్నర్ గుండెపోటుతో మ‌ర‌ణించ‌గా, వారి మృతి ప్ర‌తి ఒక్క‌రిని క‌లిచి వేసింది. అంత చిన్న వ‌య‌స్సులో అర్ధాంత‌రంగా మ‌ర‌ణించ‌డం ప‌ట్ల చాలా మంది ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. చిన్నారి పెళ్లికూతురు(బాలికా వధు)తో దేశవ్యాప్తంగా పాపులారిటీ తెచ్చుకున్న సిద్దార్థ్ మ‌ర‌ణంతో బొమ్మ‌రిల్లు హీరో సిద్ధార్థ్ ఫ్రేంలోకి వ‌చ్చాడు.


హీరో సిద్ధార్థ్‌ ఫొటోని షేర్‌ చేస్తూ ‘రిప్‌ సిద్ధార్థ్‌’ అని కామెంట్స్ చేశారు. ఇది సిద్దార్థ్ దృష్టికి రావడంతో సదరు ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ ఆయన షాకింగ్ రియాక్షన్ ఇచ్చారు. ఎవరో కొందరు తనను కావాలనే ఇలా వేధిస్తున్నారని, ద్వేషిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.