Siddharth: నా జీవితంలోజ‌రిగిందే చెప్పాను, బాధ‌ప‌డితే నేనేం చేస్తా.. సిద్ధార్థ్ సంచ‌ల‌న కామెంట్స్

NQ Staff - October 9, 2021 / 09:45 AM IST

Siddharth: నా జీవితంలోజ‌రిగిందే చెప్పాను, బాధ‌ప‌డితే నేనేం చేస్తా.. సిద్ధార్థ్ సంచ‌ల‌న కామెంట్స్

Siddharth: మ‌హా స‌ముద్రం చిత్రంతో టాలీవుడ్‌కి రీఎంట్రీ ఇస్తున్న సిద్ధార్థ్‌.. అక్టోబ‌ర్ 2న ఓ ట్వీట్ చేసిన విష‌యం తెలిసిందే. స్కూల్‌లో మా టీచర్‌ నేర్చించిన తొలి పాఠం. మోసం చేసేవాళ్లు ఎప్పుడు బాగుపడరు. నీ విషయంలో ఏమైంది?` అని ప్రశ్నించారు సిద్ధార్థ్‌. అయితే తన ట్వీట్‌లో సమంత పేరుని పేర్కొనలేదు. కానీ సిద్ధార్థ్‌ మాత్రం సమంతని ఉద్దేశించే పెట్టారని నెటిజన్లు అంటున్నారు.

Siddharth Sensational Response over Netizens Comments

Siddharth Sensational Response over Netizens Comments

తాజాగా ఇదే విష‌యంపై సిద్ధార్థ్ ని ప్ర‌శ్నించ‌గా, దీనిపై ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యాలు చెప్పాడు. తాను ఎవ్వరినీ ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదని అన్నాడు. తాను ప్రతీ రోజూ ట్వీట్లు వేస్తాను అని, వాటి గురించి అడగకుండా ఆ ఒక్క విషయం మీదే ఎందుకు అడుగుతున్నారని రివర్స్‌లో ప్రశ్నించాడు సిద్దార్థ్. తన ఇంటి బయట కుక్కలు ఎక్కువగా ఉన్నాయని ట్వీట్ వేస్తే.. ఎవరోవచ్చి నన్ను కుక్క అంటావా? అని అంటే తానేమీ చేయలేనని సిద్దార్త్ అన్నాడు.

సమంత గురించి యాంక‌ర్ చెప్ప‌బోతుంటే నా దగ్గర ప్రస్థావించకండి.. నేను ఎవ్వరి గురించి చెబుతూ ఆ ట్వీట్ వేయలేదు.. నా జీవితంలో జరిగిన వాటి గురించి చెప్పాను. పైగా మహాసముద్రంలో కూడా ఇదే కాన్సెప్ట్ ఉంటుందని అజయ్ భూపతి అన్నాడు. ఆ సమయంలో ఈ లైన్ చెప్పాను. ట్వీట్ వేశాను అని క్లారిటీ ఇచ్చాడు.

చైతూ కంటే ముందు సమంత.. సిద్ధార్థ్‌తో ప్రేమాయణం సాగించిందని వార్తలొచ్చాయి. సిద్ధార్థ్‌ కోసం శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజలు కూడా చేసింది సమంత. అంతేకాదు సిద్ధార్థ్‌, సమంత కలిసి `జబర్దస్త్` సినిమాలో నటించారు. ఆ సినిమా టైమ్‌లో వీరిద్దరి మధ్య లవ్‌ బాగా పెరిగిందని, వీరిద్దరు మ్యారేజ్‌ కూడా చేసుకునే అవకాశాలున్నాయంటూ వార్తలొచ్చాయి. కానీ ఆ తర్వాత సడెన్‌గా బ్రేకప్‌ చెప్పుకున్నారు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us