Siddharth: సిద్ధార్థ్ చనిపోయిన‌ట్టు థంబ్ నెయిల్.. హీరో స్పంద‌న ఏంటో తెలుసా?

Siddharth: బాయ్స్‌’ సినిమాతో హీరోగా కెరీర్‌ మొదలుపెట్టిన సిద్ధార్థ్ బొమ్మ‌రిల్లు సినిమాతో బాగా పాపుల‌ర్ అయ్యాడు. నువ్వు వ‌స్తానంటే నేనొద్దంటానా సినిమా కూడా ప్రేక్ష‌కుల‌ని బాగా అల‌రించింది. అయితే రాను రాను సిద్ధార్థ్‌కి ఆఫ‌ర్స్ త‌గ్గడంతో రాజ‌కీయాల‌పై దృష్టి పెట్టాడు. ముఖ్యంగా కేంద్ర ప్ర‌భుత్వంపై త‌న‌దైన శైలిలో విమ‌ర్శ‌లు చేస్తూ వ‌స్తున్నాడు.

siddarth

బీజేపీ ప్ర‌భుత్వంపై సిద్ధార్థ్ విమ‌ర్శ‌లు చేయ‌డంతో అత‌నికి వార్నింగ్స్ కూడా వ‌చ్చాయి. ఈ క్ర‌మంలో ఆయ‌న పోలీసుల‌కు కూడా ఫిర్యాదు చేశాడు. అయితే ఈ మ‌ధ్య సిద్ధార్థ్‌కి వ్య‌తిరేఖంగా సోష‌ల్ మీడియాలో కొంద‌రు వ్య‌క్తులు త‌ప్పుడు ప్ర‌చారాలు చేస్తున్నారు.

రీసెంట్‌గా ఓ నెటిజ‌న్ సిద్ధార్థ్‌ వయసుకు సంబంధించి.. ‘40 ఏళ్లు పైబడిన సిద్ధార్త్‌తో 20 ఏళ్ల హీరోయిన్లు నటిస్తే మాత్రం వల్లమాలిన ప్రేమలు, ముద్దుల ఎమోజీలు.. ఇదెక్కడి లాజిక్కో.. దిక్కుమాలిన లాజిక్ అంటూ’ ట్వీట్ చేసి అతనికే ట్యాగ్ చేశాడు. ఈ టీట్‌పై సిద్ధార్థ్‌ కూడా ఘాటుగానే జవాబిచ్చాడు. ‘ఈ హీరోల వయస్సు టాపిక్‌లో ఫస్ట్ నేనే గుర్తొచ్చాను రా? ట్యాగ్ కూడా చేశావ్? సూపర్‌ రా దరిద్రమ్. ఎక్కడ్నుంచి వస్తార్రా మీలాంటోళ్లు?’ అంటూ ట్వీట్ చేశాడు.

మ‌రో నెటిజ‌న్ ‘నువ్వు ప్రకాష్ రాజ్ క్లాస్ మేట్స్ అంటగా’ అంటూ ట్వీట్ చేశాడు. ‘ఛా! అతను నా దత్తపుత్రుడు.. నేను మోహన్ బాబు గారు క్లాస్‌మేట్స్.. ముందు నిజాలు తెలుసుకో’ అంటూ సిద్ధార్థ్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నాడు.

తాజాగా ఓ యూట్యూబ్ థంబ్ నెయిల్‌కి సిద్ధార్త్ ఫొటో వాడారు. ఆ వీడియో ఏంటంటే చిన్న ఏజ్ లో చ‌నిపోయిన సౌత్ ఇండియన్ స్టార్స్‌కి సంబంధించిన‌ది. వ్యూస్ కోసం థంబ్ నెయిల్‌గా సిద్ధార్థ్ ఫొటో వాడారు. దీనిపై ఓ నెటిజ‌న్ ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు. వ్యూస్ కోసం ఇలా చేస్తారా అని సిద్ధార్థ్ ని ట్యాగ్ చేశాడు.

దీనికి స్పందించిన సిద్ధార్త్ … చాలా సంవ‌త్స‌రాల క్రితం యూట్యూబ్‌కి ఈ విష‌యంపై కంప్లైంట్ చేశాను. వారు ఈ వీడియో వ‌ల‌న ఏ ప్రాబ్ల‌మ్ ఉండ‌ద‌ని అన్నారు. దానికి నేను ఓ పాపి అని అన్నాను అని త‌న కామెంట్‌లో తెలియ‌జేశారు. సిద్ధార్థ్ మ‌హా స‌ముద్రం చిత్రంతో రీఎంట్రీ ఇస్తున్నాడు. ఇందులో శ‌ర్వానంద్‌తో క‌లిసి న‌టిస్తున్నాడు.